AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: కరోనాపై పోరులో కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి చిన్నారులకు రక్షణ కవచాలుః మంత్రి జితేంద్ర సింగ్

థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందనే అంచనాల నేపథ్యంలో, కరోనాపై పోరులో కీలకంగా మారిన వ్యాక్సిన్లపై కేంద్రం కీలక వార్త చెప్పింది.

Covid Vaccine: కరోనాపై పోరులో కేంద్రం గుడ్‌న్యూస్..   త్వరలో అందుబాటులోకి చిన్నారులకు రక్షణ కవచాలుః మంత్రి జితేంద్ర సింగ్
Covid Vaccine
Balaraju Goud
|

Updated on: Jul 21, 2021 | 6:39 AM

Share

థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందనే అంచనాల నేపథ్యంలో, కరోనాపై పోరులో కీలకంగా మారిన వ్యాక్సిన్లపై కేంద్రం కీలక వార్త చెప్పింది. చిన్నారులకు రక్షణ కవచాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.

కరోనా వ్యాక్సిన్ల పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో నాలుగు వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు మరో వ్యాక్సిన్‌ ప్రీ క్లినికల్‌ దశలో ఉందని వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విజ్ఞాన, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి నిమిత్తం కేంద్రం ప్రకటించిన మూడో ఉద్దీపన ప్యాకేజీ ‘ఆత్మనీర్భర్‌ భారత్ 3.0’లో భాగంగా ‘మిషన్ కోవిడ్ సురక్ష-ఇండియన్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెవలప్మెంట్ మిషన్’ ప్రకటించినట్లు సింగ్ తెలిపారు.

కాడిల్లా హెల్త్‌కేర్ లిమిటెడ్‌ డీఎన్‌ఎ ఆధారిత టీకా మూడోదశ క్లినికల్ పరీక్షల్లో ఉందని, దీని అత్యవసర వినియోగ ఆమోదం కోసం మధ్యంతర డేటాను కూడా సమర్పించిందని జితేంద్ర సింగ్ తెలిపారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ టీకా కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్టు చెప్పారు. అలాగే ముక్కులో వేసే భారత్ బయోటెక్ టీకా కూడా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉందన్నారు.

జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌కు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకా టీకా ట్రయల్స్‌ మొదటి దశలో ఉన్నాయన్నారు. గుర్గావ్‌కు చెందిన జెనిక్ లైఫ్ సైన్సెస్ టీకా అడ్వాన్స్‌డ్‌ ప్రీ-క్లినికల్ దశలో ఉన్నాయని సింగ్ తెలిపారు. ప్రస్తుతం సీరం ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్‌, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాక్సిన్, రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లు దేశంలో పంపిణీకి అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే హెచ్చరికల నేపథ్యంలో, ముక్కులో వేసే భారత్ బయోటెక్ టీకాతో చిన్నారులపై ముప్పు తగ్గవచ్చని, తొందరగా పంపిణీ చేస్తే మేలని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు.

Read Also…  Depression: డిప్రెషన్.. పుట్టగొడుగులకు నయం చేసే శక్తి ఉందంటున్న శాస్త్రవేత్తలు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్