YS Sharmila : వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నల్గొండ జిల్లాలో ఈ ఉదయం మంగళవారం దీక్ష మొదలుపెట్టారు. చండూరు మండలం పుల్లెంల గ్రామంలో షర్మిల నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్ (26) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె దీక్ష ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకూ షర్మిల దీక్ష కొనసాగుతుంది. ‘జోహార్ పాక శ్రీకాంత్’ అంటూ ఈ సందర్భంగా సభాస్థలి నుంచి షర్మిల నినాదాలు చేశారు.
తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ షర్మిల ప్రతీ మంగళవారం నిరుద్యోగల కోసం చేస్తున్న నిరాహార దీక్ష నేటికి మూడో వారం చేరుకుంది. ఇలా ఉండగా, అటు, టీఆర్ఎస్ సర్కారు మీద షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. “అవ్వ పెట్టది అడక్కు తిననీయది అన్నట్టే ఉంది KCR దొర తీరు ..రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాలలో పంటలను నష్టపోయారు రైతులు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి గత సంవత్సరం తప్పుకున్న రాష్ట్రప్రభుత్వం.. సొంత పంటల బీమా పాలసీని తీసుకొస్తాం అని గొప్పగా చెప్పిన ఇంతవరకు తీసుకురాలేదు.. దీనితో రైతులకు అటు కేంద్రం బీమా వర్తించక.. ఇటు రాష్ట్ర బీమా దిక్కులేక .. రైతు కష్టాలు పడుతున్నడు .. నష్టాల పాలౌతున్నడు. ఇప్పుడైనా మేలుకోండి CM సారు” అంటూ ఒక ట్వీట్ లో షర్మిల నిన్న విమర్శలు గుప్పించారు. ఇవాళ దీక్షా స్థలిలో ప్రసంగించిన పలువురు పార్టీ నేతలు సైతం టీఆర్ఎస్ సర్కారు మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రతీ మంగళవారం నిరుద్యోగల కోసం నిరాహార దీక్ష మూడో వారం.
పుల్లెంల గ్రామం, చండూరు మండలం, మునుగోడు నియోజకవర్గం.
‘జోహార్ పాక శ్రీకాంత్’ pic.twitter.com/XUGhYBDaOG— YS Sharmila (@realyssharmila) July 27, 2021
Read also : AP Crime News : కత్తితో ఆవు కాలును నరికిన క్రూరుడు, బావ కంటిపై కత్తివేటు వేసిన బావమరిది