గులాబీ గూటికి చేరేందుకు భారీ ప్లాన్ చేసుకుంటున్నారు TTDP మాజీ అధ్యక్షుడు L.రమణ. సోమవారం TRS పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నారు TTDP మాజీ అధ్యక్షుడు L రమణ. ఆయనకు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు. అనంతరం ఈ నెల 16న సహచరులతో కలిసి TRSలో L రమణ చేరనున్నారు. ఇప్పటికే TDP తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి L. రమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గురువారం CM KCRతో L. రమణ భేటీ అయ్యారు. తన రాజీనామా పత్రాన్ని శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. కొంత కాలంగా TDPని వీడి TRSలో చేరాలని L. రమణ భావిస్తున్నారు. రమణతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు దఫాలుగా చర్చలు జరిపారు.ఈ చర్చలు ఫలవంతమయ్యాయి. దయాకర్ రావు దగ్గరుండి గురువారంనాడు రమణను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారాయన. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక రాబోతున్న తరుణంలో రమణ టీఆర్‌ఎస్‌కి వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రమణ TDP నుంచి MP, MLA, మంత్రి వంటి పదవులు చేసిన అనుభవం ఉంది. అదే సమయంలో TDPలో ఉన్నప్పుడు KCRతోనూ సాన్నిహిత్యముంది.
ఈ సాన్నిహిత్యం కొద్దీ.. రమణ కారెక్కుతున్నట్టు చెబుతున్నారు. అన్నిటికన్నా మించి ఇంకా TDPలోనే ఉంటే.. తనకు తగిన రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఆలోచనతో L.రమణ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.