AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీటీడీ ఉద్యోగులకు క్రీడా పోటీలు.. అధికారులు కూడా వారితో కలిసే ఆడాల టీటీడీ ఈవో ఆదేశం

టీటీడీ ఉద్యోగులకు ప్రతి ఏటా నిర్వహించే స్పోర్ట్స్, గేమ్స్ ఈ ఏడాది ఎలా నిర్వహించాలనే అంశంపై శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో..

టీటీడీ ఉద్యోగులకు క్రీడా పోటీలు.. అధికారులు కూడా వారితో కలిసే ఆడాల టీటీడీ ఈవో ఆదేశం
K Sammaiah
|

Updated on: Feb 16, 2021 | 5:18 PM

Share

టీటీడీ ఉద్యోగులకు ప్రతి ఏటా నిర్వహించే స్పోర్ట్స్, గేమ్స్ ఈ ఏడాది ఎలా నిర్వహించాలనే అంశంపై శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం ఈవో అధికారులతో సమీక్షించారు. ఉదయం కార్యాలయ పని వేళలకు ముందు, సాయంత్రం కార్యాలయ పని వేళలు ముగిశాక స్పోర్ట్స్, గేమ్స్ ఎలా నిర్వహిస్తారో ప్రణాళిక తయారు చేయాలని ఈవో సూచించారు. ఏటా ఎంత మంది ఉద్యోగులు వీటిలో పాల్గొంటున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

క్రీడల్లో వ్యక్తిగత పోటీల్లో పాల్గొనేవారు, టీమ్ లుగా పాల్గొనే వారు ఈ నెల 20వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకునే ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. అప్పటి కప్పుడు పేర్లు నమోదు చేసుకునే విధానం వల్ల క్రమశిక్షణ ఉండదని ఈవో అభిప్రాయపడ్డారు. పేర్ల నమోదు అయ్యాక ఏ టీమ్ ఎప్పుడు ఆడాలో, ఏ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారో ముందే ప్రకటించాలని చెప్పారు. సెలవు రోజుల్లో గేమ్స్ నిర్వహించేలా ప్రణాళిక తయారు చేస్తే మంచిదని ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి సూచించారు.

గేమ్స్ నిర్వహణ కోసం ఎక్కువ గ్రౌండ్లు అందుబాటులోకి తెచ్చుకోవాలని, పరిపాలన భవనం లోని గ్రౌండ్ ను కూడా బాగా ఉపయోగించుకోవాలన్నారు. క్రీడల్లో అందరూ సమానమేనని, అధికారులు కూడా ఉద్యోగులతో కలసి ఆడాలన్నారు. అధికారులకు ప్రత్యేకంగా టీమ్ లు అవసరం లేదని చెప్పారు. విజేతలకు నగదు బహుమతులు వద్దని, వారికి ఉపయోగపడే వస్తువులైనా సరే బహుమతిగా ఇవ్వాలన్నారు. మార్చి 14వ తేదీలోగా స్పోర్ట్స్, గేమ్స్ ముగించి 14వ తేదీ బహుమతుల ప్రదానం కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈవో చెప్పారు.

క్రికెట్ లాంటి గేమ్స్ లో అనుభవం, అవగాహన ఉన్న వారినే ఆడించాలని, లేక పోతే గాయాలయ్యే ప్రమాదం ఉంటుందని ఈవో చెప్పారు.టీటీడీ సంక్షేమ శాఖ అధికారి ఆనంద రాజు తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read more:

పల్లాను పరామర్శించిన చంద్రబాబు.. నాటి ప్రాణ త్యాగాన్ని కొనేయాలనుకుంటున్నారా అంటూ ధ్వజం