Jagadish Reddy: ఏపీ సీఎం అసత్యాలు, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు : మంత్రి జగదీశ్‌రెడ్డి

Jagadish reddy - CM Jagan : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాలపై అసత్యాలు, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు తెలంగాణ మంత్రి

Jagadish Reddy: ఏపీ సీఎం అసత్యాలు, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు : మంత్రి జగదీశ్‌రెడ్డి
Ts Minister Jagadish Reddy

Updated on: Jul 08, 2021 | 9:40 PM

Jagadish Reddy – CM Jagan : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాలపై అసత్యాలు, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి. తెలంగాణకు వైఎస్ కు మించిన ద్రోహం తలపెడుతున్నారన్నారు. తెలంగాణా ప్రాజెక్టులు అక్రమమని జగన్ అనడం హాస్యాస్పదం అన్నారు. మంత్రి జగదీష్‌ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బాలినేని కౌంటర్‌ ఇచ్చారు. రాజశేఖర్‌రెడ్డి తెలంగాణలో ఎవరికీ ద్రోహం, అన్యాయం చేయలేదన్నారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు.

వైయస్ రాజశేఖరరెడ్డిని విమర్శించే అర్హత తెలంగాణ మంత్రులకు లేదని బాలినేని వ్యాఖ్యానించారు. వైయస్ ను విమర్శిస్తున్న తెలంగాణ మంత్రులకు పుట్టగతులు ఉండవని శాపనార్థాలు పెట్టారు. తెలంగాణలోని చాలా ఇళ్లలో ఇప్పటికీ వైయస్ ఫొటోలు ఉన్నాయని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, హుజూరాబాద్ ఎన్నికల కోసమే తెలంగాణ మంత్రులు వైయస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

వైయస్ జయంతి సందర్భంగా ఒంగోలులో వైయస్ విగ్రహానికి బాలినేని పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

Read also: Payyavula Keshav: జమా ఖర్చులకు సంబంధించి లెక్క తేలడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన పయ్యావుల