Palla Rajeswara Reddy : నల్గొండ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకున్న టీఆర్ఎస్, పల్లా రాజేశ్వరరెడ్డి విజయం

Palla Rajeswara Reddy : నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం సిట్టింగ్ సీటును టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్..

Palla Rajeswara Reddy : నల్గొండ ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకున్న టీఆర్ఎస్, పల్లా రాజేశ్వరరెడ్డి విజయం
Palla Rajeshwar Reddy

Updated on: Mar 20, 2021 | 10:59 PM

Palla Rajeswara Reddy : నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం సిట్టింగ్ సీటును టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. ఎన్నికల అధికారి ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. పల్లా రాజేశ్వరరెడ్డికి మల్లన్న అలియాస్ నవీన్ గట్టి పోటీ ఇచ్చారు. చివరి దశలో కోదండరామ్ ఎలిమినేషన్‌తో పల్లా వర్సెస్ మల్లన్న మధ్య టఫ్ ఫైట్ నడిచింది. పల్లా, మల్లన్న మధ్య హోరాహోరీ పోటీ జరుగుతుండటంతో ఫలితాన్ని ముందే గమనించిన కోదండరాం కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read also : Talasani : ఇది పట్టభద్రులు, ఉద్యోగుల గెలుపు. నోటికొచ్చినట్లు మాట్లాడే పార్టీలకు చెంప పెట్టు : తలసాని