తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో ఆలోచించండి: కేసీఆర్

| Edited By: Anil kumar poka

Apr 02, 2019 | 1:20 PM

గోదావరిఖని: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం గోదావరిఖనిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు. ప్రతి రంగంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న మార్పును ప్రజలు గమనించాలని కోరారు. ప్రతి రంగంలో ఎంతో మార్పు మనకు కనిపిస్తుందని చెప్పారు. మనం దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పలు […]

తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో ఆలోచించండి: కేసీఆర్
Follow us on

గోదావరిఖని: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం గోదావరిఖనిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు.

ప్రతి రంగంలో అప్పటికీ ఇప్పటికీ ఉన్న మార్పును ప్రజలు గమనించాలని కోరారు. ప్రతి రంగంలో ఎంతో మార్పు మనకు కనిపిస్తుందని చెప్పారు. మనం దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పలు సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల వాళ్లు వచ్చి ఈ పథకాల గురించి అధ్యయనం చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్వర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.