తమ రక్తంలోనే ప్రజా సేవ ఉందన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి.. ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో చెప్పిన వాణిదేవి

|

Feb 24, 2021 | 3:55 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. ఇక గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచనలో నిమగ్నం..

తమ రక్తంలోనే ప్రజా సేవ ఉందన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి.. ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో చెప్పిన వాణిదేవి
Follow us on

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. ఇక గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహరచనలో నిమగ్నం అయ్యాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలంంగాణ భవన్ సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్టీ ముఖ్యనేతలు హాజరైన ఈ మావేశంలో హబూబ్‌నగర్‌ – రంగారెడ్డి – హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలోకి దిగిన వాణిదేవి గెలుపుపై చర్చించారు.

టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తాను పోటీ చేస్తున్నానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి తెలిపారు. తమ రక్తంలోనే ప్రజా సేవ ఉందని చెప్పారు. విద్యాలయాల ద్వారా తాను 35 ఏళ్లుగా సేవ చేస్తున్నానని పేర్కొన్నారు. తమ విద్యాలయాల్లో చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని వెల్లడించారు. అణు రంగం నుంచి అంతరిక్షం వరకు తమ విద్యార్థులు పనిచేస్తున్నారని వాణీదేవి తెలిపారు.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వాణీదేవి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి వాణిదేవికి ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ, ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఇప్పుడు మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వాణిదేవిని బరిలోకి దించారు.

Read more:

లోటస్‌పాండ్‌లో విద్యార్థల సందడి.. మీ అక్కగా సమాజాన్ని మార్చేందుకే వచ్చా.. ఇంకేమీ మాట్లాడారంటే..