జనగాంలో రాష్ట్రస్థాయి కబట్టీ పోటీలు.. ప్రారంభోత్సవంలో కబడ్డీ ఆటతో అలరించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
జనగాం జిల్లా కేంద్రంలో ప్రారంభమైన 47వ రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడా పొటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ ఆయన కాసేపు ఆటవిడుపుగా..
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గత కొద్ది రోజులుగా ఏది చేసిన హాల్ చల్ అవుతుంది. ఆ విధంగా ఆయన తన గ్రాప్‌ను పెంచుకున్నారు మరి. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు విషయంలో తమ అధినేత కేసీఆర్ విధించిన టార్గెట్ రీచ్ అయ్యే వరకు తన గడ్డం తీయనాని గతంలో సంచలనం రేపారు. దీంతో రాజయ్య కామెంట్స్.. ఆయన సొంత నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇక ఆ వ్యాఖ్యలు మరువక ముందే మరో సారి తన మార్క్‌ను చాటుకున్నారు.
జనగాం జిల్లా కేంద్రంలో ప్రారంభమైన 47వ రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడా పొటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ ఆయన కాసేపు ఆటవిడుపుగా కబడ్డీ ఆడారు. పోటీలను ప్రారంభించి మొదటగా కూతకు వెళ్లి.. కబడ్డీ, ,కబడ్డీ,, కబడ్డీ అంటూ గంతులేశాడు. ఎమ్మెల్యే కబడ్డీ ఆడిన తీరును చూసి ఆయన అభిమానులు, టీఆర్‌ఎస్ కార్యక్తలు సంబ్రమశ్చర్యానికి గురయ్యారు.
జిల్లా కేంద్రంలొని స్థానిక బతుకమ్మకుంటలొ 47వ జూనియర్ అంతర్ జిల్లాల కబడ్డి క్రిడలు జనగాం జిల్లా కబడ్డి అసోసియేషన్ అద్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ముఖ్యతిదులుగా హాజరైన ఎమ్మెల్సీ పొచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. 33జిల్లాల నుంచి 66 జట్లు జూనియర్ విభాగంలొ పోటీ పడుతున్నాయి.
అయితే కబడ్డీ పోటీలు ప్రారంభ సూచకంగా ఎమ్మెల్యే రాజయ్య బాలుర జట్టుతో ఆయన కోర్టులోకి కూతకు దిగారు. కొద్ది క్షణాలు కోర్టులో కబడ్డీ కబడ్డీ అని చిందులు వేయడంతో నిర్వాహకులు, క్రీడాకారులు కేరింతలు కొట్టారు. ఇక కబడ్డీ పోటీలను ఉద్దేశించి ఎమ్మెల్సీ పొచంపల్లి శ్రీనివాస్ మాట్లడుతూ రాష్ట్రం ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు పెద్దపీట వేస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడం కోసం సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అందు కోసం ప్రతీ బడ్జెట్‌లో క్రీడాశాఖకు అధిక నీధులు కేటాయిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత క్రీడా రంగంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రభత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని క్రీడల్లో రాణించాలని కోరారు.
Read More:
సాగర్ ఉప పోరుపై స్ట్రాటజీ మార్చిన గులాబీ బాస్.. ఇంతకీ ఆ ఐదుగురలో అధినేత ఆశీర్వాదం ఎవరికి..?