Balka suman on Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీద హాట్ కామెంట్స్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్. బండి సంజయ్ పాదయాత్ర చేయాల్సింది తెలంగాణలో కాదు ఢిల్లీకి చేయాలి పాదయాత్ర.. అంటూ సుమన్ ఎద్దేవా చేశారు. “ప్రజాస్వామ్య భారతదేశం కోసం మోదీ మీద ఢిల్లీకి పాదయాత్ర చేయాలి.. మోదీ నేతృత్వంలో నడుస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా దేశంలో దళితులు, మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బండి సంజయ్ పాదయాత్ర చేయాలి.” అంటూ సెటైర్లు వేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని వీణవంక సోషల్ మీడియా అవగాహన సదస్సులో బాల్క సుమన్, బీజేపీ మీద హాట్ కామెంట్స్ చేశారు. “కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు బండి సంజయ్ పాదయాత్ర చేస్తాడట.. బండి సంజయ్ పాదయాత్ర కేవలం హుజురాబాద్ కోసమే. హుజూరాబాద్ ఎన్నిక మోదీ అహంకారానికి తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతుంది” అని బాల్కా చెప్పుకొచ్చారు.
తెలంగాణలో అభివృద్ధి ఆగదని కేసీఆర్ చెప్తూనే ఉన్నారన్న బాల్కా సుమన్.. “స్వీయ రాజకీయ ఆస్తిత్వమే తెలంగాణకి శ్రీరామ రక్ష. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు సురక్ష. తెలంగాణ దొంగల చేతికి పోవద్దు మోసాగాళ్ల చేతికి పోవద్దు ద్రోహుల చేతికి పోవద్దు.” అని ప్రసంగించారు. ఈ తెలంగాణ ఢిల్లీ చేతికి పోకూడదు.. తెలంగాణ బిడ్డల చేతిలోనే ఉండాలని బాల్కా సుమన్ అన్నారు.
Read also: Jagga Reddy : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతోంది : జగ్గారెడ్డి