TRS: రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం

|

Aug 23, 2021 | 3:09 PM

మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర

TRS: రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం
Cm Kcr
Follow us on

KCR: మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, మరియు రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.

దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషి పై చర్చించనున్నారు.ముఖ్యంగా ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్ధతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషిపై కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

Read also: Young lady agitation: న్యాయం చేయండంటూ ప్రేమికుని ఇంటి ముందు మౌనదీక్ష చేస్తున్న యువతి

మొరిపిరాల లవ్ చీటింగ్ కేసులో కొత్త కోణాలు.. సందీప్ కుమార్‌ను బలితీసుకున్న హానీ ట్రాప్.!