MLC Elections Results: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో ఆపార్టీలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రెండు నియోజకవర్గాల్లోనూ పట్టభద్రులు గులాబీ అభ్యర్థులకే పట్టం కట్టడంతో కార్యకర్తలు వేడుకలు చేసుకుంటున్నారు. మహబూబబాద్ జిల్లా గూడూరులో టీఆర్‌ఎస్ విజయోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి.
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి, ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించడంతో సంబరాలు మిన్నంటాయి. తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్ అవతరించిందంటూ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పండుగ వాతావరణంలో పటాకుల కాల్చి సంబురాలు జరిపారు.
గూడూరు లో జిల్లా నాయకుడు వెంకట క్రిష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. “టీఆర్‌ఎస్‌కు విజయాన్నందించిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ప్రస్థానం గూడూరు నుంచే ప్రారంభమైంది. సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలూ శ్రమించే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి పట్టభద్రులు మరోసారి పట్టం కట్టారు. గూడూరు నుంచి అత్యధికంగా పట్టభద్రులు 70 శాతం పల్లావైపే మొగ్గు చూపారని వెంకటక్రిష్ణారెడ్డి తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్థులు విజయం సాధించడాన్ని హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెరాస శ్రేణులు మిఠాయిలు పంచిపెట్టి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ రోజు రాష్ట్రంలో 70 అసెంబ్లీ, 14 లోకసభ నియోజకవర్గాలలో ఈ ఎన్నికలు జరిగాయని, విద్యావంతులు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనను మళ్లీ దీవించారని, ఈ రెండు ఎమ్మెల్సీలు గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ గెలుపు టీఆర్‌ఎస్ పాలనకు రెఫరెండం అని అభివర్ణించారు. సోషల్ మీడియాలో తెఆర్‌ఎస్‌పై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా చివరకు పట్టభద్రులు, ఉద్యోగులు వాణి దేవిని, పల్లారాజేశ్వర్ రెడ్డిని గెలిపించారని అన్నార. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More: