త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపై దాడి.. బీజేపీ కార్యకర్తల పనేనంటున్న పార్లమెంటేరియన్లు..

| Edited By: Anil kumar poka

Aug 15, 2021 | 6:13 PM

త్రిపురలో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపై దాడి జరిగింది. ఈ దాడిలో వీరి సహాయకుడొకరు గాయపడ్డారు. రాజధాని అగర్తలకు సుమారు 70 కి.మీ. దూరంలోని బెలోనియా టౌన్ వద్ద తాము కారులో ప్రయాణిస్తుండగా కొందరు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని అపురూప పొద్దార్..,

త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపై దాడి.. బీజేపీ కార్యకర్తల పనేనంటున్న పార్లమెంటేరియన్లు..
Trinamool Mps Alkegedly Attacked In Tripura
Follow us on

త్రిపురలో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపై దాడి జరిగింది. ఈ దాడిలో వీరి సహాయకుడొకరు గాయపడ్డారు. రాజధాని అగర్తలకు సుమారు 70 కి.మీ. దూరంలోని బెలోనియా టౌన్ వద్ద తాము కారులో ప్రయాణిస్తుండగా కొందరు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారని అపురూప పొద్దార్, డోలాసేన్ అనే ఈ ఎంపీలు తెలిపారు. జాకీర్ అనే తమ అసిస్టెంట్ తలకు గాయాలయ్యాయని,, దుండగుల ఎటాక్ లో కారు అద్దాలు పగిలిపోయాయని వీరు తెలిపారు.దుండగుల చేతిలో బీజేపీ జెండాలు ఉన్నట్టు వారు చెప్పారు. వైద్య చికిత్స కోసం వీరు కోల్ కతాకు వెళ్లనున్నారు. అయితే ఇదంతా డ్రామా అని త్రిపుర బీజేపీ నేతలు కొట్టి పారేశారు. మీడియా దృష్టిని మరల్చడానికి ఇలా చేస్తున్నారని వారన్నారు. కాగా ఈ రాష్ట్ర సీఎం బిప్లబ్ దేబ్ గూండా రాజ్యానికి ఈ ఘటన నిదర్శనమని, బీజేపీ త్రిపుర గూండాలు ఈ దాడికి పాల్పడ్డారని ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ త్రిపుర తన ఫేస్ బుక్ లో ఆరోపించింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగిన ఈ దాడిని హోమ్ మంత్రి చూస్తున్నారా అని ఈ పార్టీ పేర్కొంది.

దేశమంతా హోమ్ మినిష్టర్ అసలైన రంగును చూస్తోందని దుయ్యబట్టింది. ఈ రాష్ట్రంలో రక్తపాతాన్ని సృష్టించాలని ఈ ప్రభుత్వం చూస్తోందని తృణమూల్ నేతలు నిప్పులు చెరిగారు.. కాగా ఇటీవల టీఎంసి ఎంపీ అభిషేక్ బెనర్జీ కారుపై కూడా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా…నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో అపురూప పొద్దార్… త్రిపుర సీఎం త్వరలోనే గద్దె దిగనున్నారని వ్యాఖ్యానించినందుకు ఆగ్రహించి బీజేపీ కార్యకర్తలు దాడికి దిగినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి : బాయ్‌ఫ్రెండ్‌ కోసం..జుట్లు పీక్కుని కొట్టుకున్న అమ్మాయిలు..!ట్రెండ్ అవుతున్న వీడియో: Girls Hit For a Boyfriend Video.

 జోకర్‌ దొంగ..పోలీసులకే ఛాలెంజ్‌..!హాలీవుడ్ తరహాలో ఏటీఏం చోరీ వైరల్ వీడియో..:Joker Thief Video.

 గుప్త నిధులకోసం గుట్టపైకి వెళ్తే.. ఊహించని షాక్‌! గ్రామస్థులకు పట్టించిన చిన్న డౌట్..(వీడియో):Hidden Treasures Video.

 అంకల్‌తో యంగ్ లేడి రొమాన్స్ క్రేజీగా వస్తున్నా క్రేజీ అంకుల్స్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్..:Crazy Uncles Pre Release Video.