ఓటు దరఖాస్తునకు నేడే తుది గడువు

హైదరాబాద్ : ఓటరు గుర్తింపు కార్డు లేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం కల్పించిన గడువు నేటితో ముగియనుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేందుకు ఈ రోజు వరకు వీలుందని అధికారులు తెలిపారు. అర్హత ఉండి ఓటు లేని వారితో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ.. ఆన్‌లైన్ లేదా మీ సేవలో తమ ఓటును దరఖాస్తు చేసుకోవచ్చని.. దరఖాస్తు విషయంలో ఏలాంటి సందేహాలు ఉన్నా.. నివృత్తికి […]

ఓటు దరఖాస్తునకు నేడే తుది గడువు

Edited By:

Updated on: Mar 15, 2019 | 11:09 AM

హైదరాబాద్ : ఓటరు గుర్తింపు కార్డు లేని వారు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం కల్పించిన గడువు నేటితో ముగియనుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేందుకు ఈ రోజు వరకు వీలుందని అధికారులు తెలిపారు. అర్హత ఉండి ఓటు లేని వారితో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ.. ఆన్‌లైన్ లేదా మీ సేవలో తమ ఓటును దరఖాస్తు చేసుకోవచ్చని.. దరఖాస్తు విషయంలో ఏలాంటి సందేహాలు ఉన్నా.. నివృత్తికి టోల్‌ఫ్రీ నెంబర్ 1950ను సంప్రదించొచ్చని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో కూడా స్వతహాగా ఓటు నమోదు చేసుకోవచ్చని.. ఓటు నమోదు చేసుకునే సమయంలో ఏదేని గుర్తింపు పత్రం, చిరునామా పత్రం, కలర్‌ఫోటో తప్పనిసరిగా జతపరచాలని తెలిపారు.