YSR Awards : ఈ నెల 13న వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం.. సీఎం జగన్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్న ప్రముఖులు

|

Aug 11, 2021 | 6:32 AM

YSR Awards : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఈ నెల 13 న వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేయనుంది. ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్‌ చేతులమీదుగా ఈ అవార్డులను అందుకుంటారు.

YSR Awards : ఈ నెల 13న వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం.. సీఎం జగన్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్న ప్రముఖులు
Ysr Awards
Follow us on

YSR Awards : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఈ నెల 13 న వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేయనుంది. ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. జగన్‌ చేతులమీదుగా ఈ అవార్డులను అందుకుంటారు. జులై 8న వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా ఈ అవార్డులు ప్రకటించారు. వివిధ సంస్థలకు, వ్యవసాయం– అనుబంధ రంగాలకు, కళలు– సంస్కృతి రంగానికి, సాహిత్యంలో విశేష కృషిచేసిన వారికి, జర్నలిజంలో లబ్ధప్రతిష్టులకు, వైద్య ఆరోగ్యం రంగంలో అసమాన సేవలు అందించిన వారు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.13న జరిగే ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు, వ్యక్తులు మొత్తం 29 మంది వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు, మరో 31 మంది వేర్వేరు సంస్థలకు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి అవార్డులు అందిస్తారు. విజయవాడ ఏ1 కన్వెన్షన్‌ సెంటర్లో ఆగస్టు 13న ఉదయం 11 గంటలకు అవార్డుల కార్యక్రమం జరగనుంది.

కోవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు పంపారు. అవార్డు గ్రహీతలతోపాటు, మంత్రులు, కీలక అధికారులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. పరిమిత సంఖ్యలో మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నారు. అవార్డు గ్రహీతలకు ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానం పంపారు. 12వ తేదీ రాత్రికల్లా వారు విజయవాడ చేరుకుంటారు. అవార్డు గ్రహీతలందరికీ విజయవాడలో నొవొటెల్‌హోటల్లో విడిది ఏర్పాటు చేశారు. గ్రహీతలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఆతిథ్యంతోపాటు, వేదిక వద్దకు తీసుకురావడం, అవార్డు తీసుకునేంతవరకూ వారికి తోడుగా ఉండేందుకు అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశారు.

వివిధ రంగాల్లో నిష్ణాతులను క్షేత్రస్థాయలో గుర్తిస్తూ, అసమాన సేవలు అందిస్తున్న వారికి ఈ తరహా అవార్డులు ఇంత భారీ సంఖ్యలో ఇవ్వడం రాష్ట్రచరిత్రలో ఇదే ప్రథమం. వేదిక మీద ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటున్నారు. అవార్డు స్వీకరణకు పిలిచేముందు వారు ఏయే రంగాల్లో నిష్ణాతులో, వారు చేసిన కృషిని తెలియజేస్తూ ఒక నిమిషం పాటు వీడియోను ప్రదర్శిస్తారు. తర్వాత మంత్రులు లేదా సీనియర్‌ అధికారులు వారిని తోడ్కొని వేదికమీదకు తీసుకు వస్తారు.

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారికి త్వరగా వివాహం జరిగే ఛాన్స్.. మీ రాశి ఇందులో ఉందా?

Puri Jagannadh: దేవుడు ఉన్నాడా? లేడా?.. ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. వీడియో వైరల్..

Chanakya Niti: ఇతరులు చేసే తప్పులకు.. వేరొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.. చాణుక్యుడు వివరించిన నీతి సూత్రాలు