ఎగ్జిట్ పోల్స్ తప్పు.. బీజేపీ.. ఒక మునిగిపోతున్న నౌక : శశిథరూర్

| Edited By:

May 22, 2019 | 7:34 PM

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో… ఇక విజయం తమదేనన్న అంచనాలతో ఓవైపు బీజేపీ సంబరాల్లో ఉండగా… మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాత్రం కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ‘మునిగిపోతున్న నౌక’తో పోల్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాను సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ముందస్తు విజయోత్సవాలకు బీజేపీ సిద్ధమవుతుండటంపై తిరువనంతపురంలో జరిగిన ఓ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందించారు. బీజేపీ వాళ్లు ఎలాంటి సన్నాహకాలైనా చేసుకోవచ్చని, అయితే ప్రజాస్వామ్యంలో ఓటరిచ్చే తీర్పే […]

ఎగ్జిట్ పోల్స్ తప్పు.. బీజేపీ.. ఒక మునిగిపోతున్న నౌక : శశిథరూర్
Follow us on

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో… ఇక విజయం తమదేనన్న అంచనాలతో ఓవైపు బీజేపీ సంబరాల్లో ఉండగా… మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాత్రం కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని ‘మునిగిపోతున్న నౌక’తో పోల్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాను సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ముందస్తు విజయోత్సవాలకు బీజేపీ సిద్ధమవుతుండటంపై తిరువనంతపురంలో జరిగిన ఓ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నపై ఆయన స్పందించారు. బీజేపీ వాళ్లు ఎలాంటి సన్నాహకాలైనా చేసుకోవచ్చని, అయితే ప్రజాస్వామ్యంలో ఓటరిచ్చే తీర్పే అంతిమ తీర్పు అవుతుందని సమాధానమిచ్చారు.

ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, అంచనాలు తప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయని శశిథరూర్ చెప్పారు. ఎన్డీయే, వాజ్‌పేయి గెలుపు తథ్యమని 2004లో ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు తప్పయ్యాయని గుర్తుచేశారు. ఎగ్జిట్ పోల్స్‌ను విశ్వసించాల్సిన పనిలేదని, టీవీ ఛానెల్స్ అంచనా వేసినన్ని సీట్లు బీజేపీకి రావని.. సహజంగానే ఇండియాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని అన్నారు. కాగా, తిరువనంతపురం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న శశిథరూర్ మరోసారి ఆ నియోజవవర్గం నుంచి గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేశారు