అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులున్నారు: కమల్ వివరణ

స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, మహాత్మా గాంధీని చంపిన నాధురామ్ గాడ్సే మొదటి టెర్రరిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని ఆయన అన్నాడు. తన మాటలకు వస్తోన్న విమర్శల నేపథ్యంలో తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. కానీ అన్ని మతాల్లోనూ టెర్రరిస్ట్‌లు ఉన్నారంటూ కమల్ చెప్పుకొచ్చాడు. ఎవరూ తాము ఉత్తములని చెప్పుకోరని […]

అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులున్నారు: కమల్ వివరణ

Edited By:

Updated on: May 17, 2019 | 10:55 AM

స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని, మహాత్మా గాంధీని చంపిన నాధురామ్ గాడ్సే మొదటి టెర్రరిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు ఉన్నారని ఆయన అన్నాడు. తన మాటలకు వస్తోన్న విమర్శల నేపథ్యంలో తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. కానీ అన్ని మతాల్లోనూ టెర్రరిస్ట్‌లు ఉన్నారంటూ కమల్ చెప్పుకొచ్చాడు. ఎవరూ తాము ఉత్తములని చెప్పుకోరని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు ఇప్పుట్లో కనుమరుగయ్యాయని ఆయన తెలిపాడు. ఆ రోజు తాను మతసామరస్యం గురించి మాట్లాడానని.. హిందూ, ముస్లిం, క్రైస్తవుల నాయకులతో తాను భేటీ అవుతానని చెప్పాడు. ఇక తనపై చెప్పులు విసిరినాా, రాళ్లు విసిరినా పెద్దగా బాధపడనని చెప్పుకొచ్చాడు.