కృష్ణాజిల్లాలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు.. ఘటనాస్థలిలోనే బైఠాయించిన మాజీ మంత్రి.!

|

Jul 10, 2021 | 9:58 PM

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చింతగుంటపాలెంలో ఆక్రమ షాపుల తొలగింపు కార్యక్రమం ఘర్షణకు దారితీసింది...

కృష్ణాజిల్లాలో ఉద్రిక్తత, భారీగా మోహరించిన పోలీసులు.. ఘటనాస్థలిలోనే బైఠాయించిన మాజీ మంత్రి.!
Kollu Ravindra
Follow us on

Kollu Ravindra: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఇవాళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చింతగుంటపాలెంలో ఆక్రమ షాపుల తొలగింపు కార్యక్రమం ఘర్షణకు దారితీసింది. బాధితుల పక్షాన నిలిచిన టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఘటనాస్థలిలోనే బైఠాయించారు. షాపుల తొలగింపు అంశంలో తీవ్ర వివక్ష చూపిస్తున్నారని మాజీ మంత్రి ఆందోళనకు దిగారు.

తొలగిస్తే న్యాయంగా అందరివి తొలగించాలని.. అంతేకాకుండా దుర్మార్గానికి ఒడిగడుతూ జగన్ ప్రభుత్వం.. ఆక్రమణల పేరుతో టీడీపీ కార్యకర్తల షాపులు మాత్రమే తొలగిస్తే సహించేది లేదని కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులకు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పరిస్థితులు విషమిస్తుండటంతో భారీగా మోహరించిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Kollu Ravindra2

Read also: Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో మంటగలిసిన మానవత్వం… ఏ తల్లికీ రాకూడని కష్టం