New Polling Stations: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. కొత్త పోలింగ్ కేంద్రాలు పెంచుతూ ఉత్తర్వులు!

|

Nov 07, 2021 | 8:13 AM

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల పెంపు డిమాండ్‌పై ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.

New Polling Stations: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. కొత్త పోలింగ్ కేంద్రాలు పెంచుతూ ఉత్తర్వులు!
Polling Station
Follow us on

Telangana News Polling Stations:పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల పెంపు డిమాండ్‌పై ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా 161 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 34,867కు చేరినట్లు పేర్కొన్నారు.

అలాగే, ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు ఈనెల 6న మొదలుపెట్టిన ప్రత్యేక డ్రైవ్‌ 7, 28, 29, 30 తేదీల్లో కూడా కొనసాగుతుందని వివరించారు. 2022 జనవరి 5న తుది ఓటర్ల జాబితాను వెల్లడించనున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండి ప్రతి ఒక్కరూ కొత్త ఓటును నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక, ఇటీవలే ఉపఎన్నిక జరిగిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఓటర్లకు సవరణలు, కొత్త ఓటరు నమోదుకు డిసెంబర్‌ ఆరో తేదీ వరకు అవకాశం కల్పిస్తామన్నారు.

Read Also…. Human Tail: అప్పుడే పుట్టిన శిశువును చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు.. 12 సెం.మీ తోకతో బాలుడి జననం.. ఎక్కడంటే..?