ఐటీఐఆర్, రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై లేఖల డ్రామా.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ ధ్వజం
అధికార పార్టీకి ధీటుగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓవైపు టీఆర్‌ఎస్ మంత్రులు మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ల చీఫ్‌లు ఒకేసారి ప్రచారం చేస్తుండటం..
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పార్టీల అధ్యక్షులు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కోసం బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీకి ధీటుగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓవైపు టీఆర్‌ఎస్ మంత్రులు మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ల చీఫ్‌లు ఒకేసారి ప్రచారం చేస్తుండటం మరింత హీట్‌ను రాజేస్తుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పర్యటించారు. ములుగుజిల్లాలో ప్రచారం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని సెంటిమెంట్‌ను రాజేశారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఓటు అడగని సీఎం కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాక్షస పాలన పోవాలని సమ్మక్క సారక్క తల్లులకు మొక్కుకున్నానన్నారు.
బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదన్న సంజయ్.. 80 శాతం ఉన్న హిందువుల గురించి బరాబర్ మాట్లాడతామన్నారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానిస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ అబద్ధాలను మేధావులు గుర్తించాలని కోరారు. బండి సంజయ్ సావుకు బయపడడన్నారు. పోయేటప్పుడు సమ్మక్క సారక్క గద్దెల నుంచి పవిత్రమైన మట్టిని తీసుకొని వెళుతానన్నారు.
బైంసా అల్లర్లను ఎప్పటికీ మర్చిపోమన్నారు బండి సంజయ్. Ghmc ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తులేదు అన్నారు. మేయర్ ఎన్నికలో టిఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటైన విషయాన్ని విజ్ఞలు గుర్తించి ఓటెయ్యాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని చెప్పారు. ఐటీఐఆర్ , రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై లేఖల డ్రామా కొత్తగా ప్రారంభించారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
కాజిపేటలో ఓరలింగ్ వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమి ఇచ్చి కోచ్ ఫ్యాక్టరీకి ఇచ్చాం అని అబద్ధాలు చెపుతున్నారని మండి సంజయ్ విమర్శించారు. అది శివుడి భూమి ఇచ్చారు.. ఆ శివుడి ఆజ్ఞకు గురికాక తప్పదు ఈ టిఆర్ ఎస్ ప్రభుత్వం అంటూ శాపనార్థాలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 120 కోట్లు పెట్టి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే 30 కోట్లు ఇవ్వకుండా ప్రారంభం చేయకపోవడం వల్ల పేద ప్రజలకు వైద్యం అందడం లేదని విమర్శించారు.
Read More:
వార్డులు, బూత్‌ల వారీగా ఎర్రబెల్లి సమీక్ష.. ఓటర్లకు ఏమేమి చెప్పాలో దిశానిర్దేశం చేసిన మంత్రి
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నోరు జారిన బీజేపీ ఎమ్మెల్యే.. ఆయనకు వ్యతిరేకంగా ఓటేయమన్న రంఘునందన్‌రావు
జనగాంలో రాష్ట్రస్థాయి కబట్టీ పోటీలు.. ప్రారంభోత్సవంలో కబడ్డీ ఆటతో అలరించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య