AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీలో చేరిన మరో తృణమూల్ కాంగ్రెస్ నేత, సువర్ణ అధ్యాయమని వ్యాఖ్య

బెంగాల్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పాలక తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా శనివారం టీఎంసీ నేత, మాజీ రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేదీ శనివారం  బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన మరో తృణమూల్ కాంగ్రెస్ నేత, సువర్ణ అధ్యాయమని వ్యాఖ్య
Umakanth Rao
|

Updated on: Mar 06, 2021 | 3:21 PM

Share

బెంగాల్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పాలక తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా శనివారం టీఎంసీ నేత, మాజీ రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేదీ శనివారం  బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు శాలువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత నెల 12 న ద్వివేదీ తన రాజ్యసభ సభ్యత్వానికి, తృణమూల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ బెంగాల్ లో హింసాత్మక ఘటనల కారణంగా తృణమూల్ కాంగ్రెస్ లో తాను ఊపిరాడని స్థితిలో ఉన్నానని, ఇప్పుడు స్వేఛ్చగా ఫీలవుతున్నానని దినేష్ ద్వివేదీ పేర్కొన్నారు. ఈ సువర్ణ అధ్యాయం కోసం తాను వేచి చూస్తూ వచ్చానన్నారు. ఆయనకు స్వాగతం పలికిన నడ్డా.. సరైన నాయకుడైన ద్వివేదీ ఇన్నాళ్లుగా తప్పుడు పార్టీలో (తృణమూల్ కాంగ్రెస్ లో) ఉన్నారని, ఇప్పుడు సరైన పార్టీలో చేరారని అన్నారు.

బెంగాల్ లో మహానాయకులు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటామని, కానీ  ఇందుకు విరుధ్దంగా జరుగుతోందని ద్వివేదీ అన్నారు. టీఎంసీ తరహా హింస, అవినీతిని బెంగాల్ రాష్ట్రం తట్టుకోజాలదని ఆయన చెప్పారు. ఈ ధోరణి రాష్ట్రాన్ని చీకటిలోకి నెట్టేస్తుందన్నారు. ఎంతో రాజకీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న ఈ రాష్ట్రం.. దాన్ని వృధా చేయకుండా చూడాల్సి ఉందన్నారు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దినేష్ ద్వివేదీ ఓడిపోగా.. ఆయనను టీఎంసీ ఎగువసభకు పంపింది. అయితే ఆ తరువాత ఆయన ఈ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా ఇప్పటికే పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. మాజీ నేత సువెందు అధికారి నుంచి ఈ వలసల  ప్రారంభమైంది,. ఆయన తో బాటు అనేకమంది కమలానికి జై కొట్టారు. అయితే ఎంతమంది వెళ్లినా తమ పార్టీకి నష్టం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ఆమె పదేపదే చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Women’s Day 2021: సంప్రదాయాలు, ఆచారాలను ఎదిరించి చిత్ర పరిశ్రమలో తమదైన ముద్రవేసిన నటీమణుల గురించి తెలుసుకుందాం

మార్చిలో ఇల్లు కట్టుకునేవారికి బంపర్ ఆఫర్.. . గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన ఐసీఐసీఐ.. ఎంత తగ్గించిందంటే..