AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Day 2021: సంప్రదాయాలు, ఆచారాలను ఎదిరించి చిత్ర పరిశ్రమలో తమదైన ముద్రవేసిన నటీమణుల గురించి తెలుసుకుందాం

స్త్రీ శక్తి స్వరూపిణి తాను తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని నిరూపించిన దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా..

Women's Day 2021: సంప్రదాయాలు, ఆచారాలను ఎదిరించి చిత్ర పరిశ్రమలో తమదైన ముద్రవేసిన నటీమణుల గురించి తెలుసుకుందాం
Surya Kala
|

Updated on: Mar 06, 2021 | 5:42 PM

Share

International Women’s Day 2021:  ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల సంబరాలు అంగరంగ వైభంగా మార్చి 1 నుంచి జరుపుకుంటున్నాము. ఈనెల 8న మహిళా దినోత్సవ వేడుక నేపథ్యంలో విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీక నిలుస్తూ.. ఎవరి అండదండలు లేకుండా తమకంటూ చరిత్ర లో గుర్తింపు తెచ్చుకున్న మహిళలను గుర్తు చేసుకుందాం. స్త్రీ శక్తి స్వరూపిణి తాను తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని నిరూపించిన దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన గుర్తింపును కలిగి చరిత్ర సృష్టించిన కొంతమంది నటీమణుల గురించి ఈరోజు తెలుసుకుందాం..!

మధుబాల

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఓ ఫేమస్ నటిగా ఖ్యాతిగాంచారు మధుబాల. 14 ఫిబ్రవరి 1933 న ఢిల్లీలో జన్మించిన మధుబాల 1940లో బాలనటిగా అడుగు పెట్టింది.. అనంతరం 14 సంవత్సరాల వయస్సులో 1942 లో బసంత్ తో హీరోయిన్ గా నటనా జీవితాన్ని ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే మధుబాల బాలీవుడ్ లో అగ్రకథానాయిక పీఠాన్ని అధిరోహించారు.

madhubala

ఇక 1946 సంవత్సరంలో, ‘నీల్ కమల్’ చిత్రం మధుబాలను అప్పటి యువత కలల రాణిగా మార్చింది. ‘భారతీయ సినిమా వీనస్’ గా పేరుపొందారు. మధుబాల ను ‘బ్యూటీ దేవత ఆఫ్ సినిమా’ గా అంతర్జాతీయ చలన చిత్ర పరిశ్రమ కూడా గుర్తించింది. 1951 లో భారత దేశ పర్యటనకు వచ్చిన ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ జేమ్స్ బుర్కే.. తన కెమెరాకు పనిచెప్పి మధుబాల అందాలను ఫోటోగా బంధించారు. లైఫ్ మ్యాగజైన్‌ కోసం ఓ ఫోటోను తీశారు. ఆ తరువాత, అతను అంతర్జాతీయ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద స్టార్ అయ్యారు. ఇక లైఫ్ మ్యాగజైన్ కవర్ పేజీలో కనిపించిన తొలి భారతీయ నటిగా మధుబాల నిలిచారు. నటిగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచినప్పటికీ మధుబాల జీవితం విషాదంతో నిండిపోయింది, ఆమెను ‘ది బ్యూటీ ఆఫ్ ట్రాజెడీ’ అని కూడా పిలుస్తారు.

జయలలిత

స్టార్ హీరోగానే కాదు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు జయలలిత. 15 ఏళ్ల వయసులో కన్నడ మూవీతో చలన చిత్రపరిశ్రమలో అడుగు పెట్టిన జయలలిత తమిళనాడు కి 6 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే నిజానికి జయలలిత ఎప్పుడు సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలని కానీ.. నటించానలని కానీ, రాజకీయాల్లో అడుగు పెట్టాలని కానీ ఎప్పుడూ అనుకోలేదు..

Jayalalitha

ఆమె చిన్నప్పటి నుంచి లా చదవాలని కోరుకున్నారు. న్యాయవాది వృత్తిని చెప్పట్టాలనేది జయలలిత చిన్నప్పటి కల. అయితే విధి వేరేగా ఆలోచించింది. రాజకీయాల్లోకి రావాలని అని అనుకోకపోయినా అడుగు పెట్టి.. తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.. ఒక జయలలిత బలమైన మహిళగా గుర్తించబడ్డారు.

రేఖ

భానురేఖ గణేశన్ దక్షిణాది నుంచి బాలీవుడ్ లో నటిగా అడుగు పెట్టి.. అత్యుత్తమ నటీమణిగా గుర్తింపు పొందారు . రంగస్థలం నుంచి నటనలో ఓనమాలు దిద్దకున్న రేఖ టాప్ హీరోయిన్ గా చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. అవమానాలను భరించారు. 16 ఏళ్ళ వయసులో ‘సావన్ బాదో’ సినిమాతో బాలీవుడ్ లో ఓవర్నైట్ స్టార్ గా మారిపోయారు. అయితే తనకు పరిచయం లేని హిందీ భాష కారణంగా బాలీవుడ్ లో చోటు సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డారు. అయితే ఎప్పటికైనా సరే హిందీ చిత్ర పరిశ్రమని ఏలాలని నిర్ణయం తీసుకున్నారు. తనతో నటించడానికి రిజెక్ట్ చేసిన వారే తనని హీరోయిన్ గా కావాలని మరీ అడిగే రోజు రావాలని ఎంతో కష్టపడ్డారు.

rekha

హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ నుంచి ఎన్నో నేపధ్య కథల్లో హీరోయిన్ గా నటించి తనదైన ముద్ర వేశారు. అప్పటి నుంచి రిజెక్ట్ చేసిన వారే రేఖతో కలిసి పనిచేయడానికి ఆరాటపడ్డారు. 180 కి పైగా సినిమాల్లో నటించిన రేఖ తన నటన, అందంతో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. పద్మశ్రీ తో సహా పలు అవార్డులను రేఖ అందుకున్నారు.

మాధురి దీక్షిత్

బాక్సాఫీస్ వద్ద అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకున్న నటిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు మాధురీదీక్షిత్. 1984లో మాధురి దీక్షిత్ “అబోద్” సినిమాతో అరంగేట్రం చేసిన మాధురీ దీక్షిత్ ‘తేజాబ్’ చిత్రంతో మంచి గుర్తింపు పొందింది. అనంతరం తనదైన నటన డ్యాన్స్ లతో అభిమానులకు కలల రాణిగా మారింది. 1980ల నుండి 1990ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో అగ్రనటిగా.. మంచి నాట్యకారిణిగా ప్రఖ్యాతి పొందారు.

madhuri deekhith మాధురి మంచి నటి మాత్రమే కాదు, ఆమె మంచి తల్లి మరియు భార్య కూడా. తన కెరీర్ తో పాటు ఫ్యామిలీ ని కూడా చక్కగా లీడ్ చేస్తారు. మాధురీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. చలన చిత్ర రంగంలో ఆమె చేసిన కృషికి మాధురికి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. నేడు మాధురి వేలాది మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

నీనా గుప్తా :

నీనా గుప్తా ఒక భారతీయ చరిత్రలో ఓ సంచలనం. అత్యంత ధైర్యవంతురాలు. నీనా గుప్తా సినీ, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత. 1994లో వో ఛోక్రీ మూవీలో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. కమర్షియల్ సినిమాలలో పాపులర్ నటి అయినప్పటికీ ఆర్టు సినిమాలలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక పెళ్లికి ముందే తల్లి అయి అప్పటి వరకూ సమాజంలో ఉన్న సంప్రదాయాలను బద్దలు కొట్టారు.

nina gupta

ప్రముఖ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో సహజీవనం చేసిన నీనా గుప్తా ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. ఎన్ని విమర్శలు ఎదురైనా పట్టించుకోకుండా దైర్యంగా ఒకటిగా కుమార్తె మసాబాను పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేశారు. ఈ రోజుకీ నీనా తన కెరీర్ లో బిజీగానే గడుపుతారు. ఒంటరి తల్లులకు , కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తున్న మహిళలందరికీ నినా గుప్త ఓ ప్రేరణగా నిలుస్తారు.

Also Read:

International Women’s Day 2021 : కరోనా కల్లోలం నేపథ్యంలో ఉమెన్స్ డే వేడుక థీమ్, ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..!

ప్రపంచ వ్యాప్తంగా మొదలైన మహిళాదినోత్సవ సంబరాలు.. దీని వెనుక ఓ మహిళ కృషి పట్టుదల ఉంది ఆమె ఎవరో తెలుసా..!