అధికారిక నివాసాన్ని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మరిన్ని సౌకర్యాల కల్పనకై నితీష్ కుమార్ ప్రభుత్వానికి అభ్యర్థన

| Edited By: Phani CH

May 20, 2021 | 1:14 PM

బీహార్ లో ఆర్జేడీ నేత, ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ తన అధికారిక నివాసాన్ని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. దీన్ని మరింత అప్ గ్రేడ్ చేయడానికి సాయపడాలని ఆయన సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.

అధికారిక నివాసాన్ని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మరిన్ని సౌకర్యాల కల్పనకై నితీష్ కుమార్ ప్రభుత్వానికి అభ్యర్థన
Tejaswi Yadav Converts His Official Residence Into Covid Care Centre
Follow us on

బీహార్ లో ఆర్జేడీ నేత, ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ తన అధికారిక నివాసాన్ని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. దీన్ని మరింత అప్ గ్రేడ్ చేయడానికి సాయపడాలని ఆయన సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. పాట్నాలోని పోలో రౌండ్ లో గల ఈ బంగళాలో రోగులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్, మందులు, అన్నీ ఉన్నాయని, కానీ మరిన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇందుకు సహకరించాలని ముఖ్యమంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి రాసిన లేఖల్లో అభ్యర్థించారు. నిపుణులతో చర్చించి ఇంకా ఇక్కడ ఏవి అవసరమో సమకూర్చాలని, ఇందుకు అయ్యే వ్యయాన్ని తానే భరిస్తానని ఆయన చెప్పారు. ఈ కోవిద్ తరుణంలో రోగులు బెడ్స్ కోసం, ఆక్సిజన్ కోసం ఇంకా మందులకోసం అక్కడికీ, ఇక్కడికీ తిరుగుతూ నానా అవస్థ పడుతుంటారని, అందువల్ల వారి సౌకర్యార్థం తన అధికారిక నివాసాన్ని ఇలా కోవిద్ సెంటర్ గా మార్చానని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఈ బంగళాను రెండేళ్ల క్రితం ఈయనకు ప్రభుత్వం కేటాయించింది. తన ఈ నూతన సెంటర్ కు మరిన్ని ఆక్సిజన్ సిలిండర్లు అవసరమవుతాయని ఆయన అన్నారు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని తనకు సాయపడుతుందని ఆశిస్తున్నానని అయన చెప్పారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కోవిద్ రోగులకు ఎంతగానో సాయపడుతున్నారని అంటూ వారిని ప్రశంసించారు.

అయితే ఈ బంగళాను కోవిద్ సెంటర్ గా మార్చేబదులు డాక్టర్ల కోసం దీన్ని వినియోగించాలని మాజీ సీఎం, హిందుస్తానీ అవామీ మోర్చా నేత జితన్ రామ్ మాంజీ..తేజస్వి యాదవ్ కి సూచించారు. మీ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మెడికల్ డిగ్రీలు తీసుకున్నారని, కోవిద్ రోగుల సేవలో వారిని కూడా భాగస్వాములను చేయాలనీ ఆయన సూచించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )

Madhya Pradesh: కోవిడ్ సెంటర్‌లో టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ… ( వీడియో )

AP Budget 2021 Live: సంక్షేమానికే పెద్ద పీట వేసిన ఏపీ ప్రభుత్వం.. 2021-22 వార్షిక బడ్జెట్‌ హైలైట్స్ ఇవే..