జగన్‌కు అన్యాయం చేశా- ఎస్వీ మోహన్‌రెడ్డి

|

Mar 21, 2019 | 3:51 PM

కర్నూలు: కర్నూలు జిల్లాలో  మరో  కీలక నేత టీడీపీని వీడనున్నారు. టికెట్‌ దక్కకపోవడంతో వైసీపీలో చేరనున్నట్లు ఆ పార్టీ కర్నూలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం వైకాపా అధినేత జగన్‌తో ఆయన భేటీ కానున్నారు. చంద్రబాబు నుంచి టికెట్ విషయంలో సృష్టమైన హామి లభించకపోవడంతో గురువారం కార్యకర్తలతో భేటీ అయిన మోహన్ రెడ్డి వాారి అభిప్రాయాలను విన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారాలని మోజారిటీ అభిమానులు  తీర్మానించడంతో ఆ మేరకు […]

జగన్‌కు అన్యాయం చేశా- ఎస్వీ మోహన్‌రెడ్డి
Follow us on

కర్నూలు: కర్నూలు జిల్లాలో  మరో  కీలక నేత టీడీపీని వీడనున్నారు. టికెట్‌ దక్కకపోవడంతో వైసీపీలో చేరనున్నట్లు ఆ పార్టీ కర్నూలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం వైకాపా అధినేత జగన్‌తో ఆయన భేటీ కానున్నారు. చంద్రబాబు నుంచి టికెట్ విషయంలో సృష్టమైన హామి లభించకపోవడంతో గురువారం కార్యకర్తలతో భేటీ అయిన మోహన్ రెడ్డి వాారి అభిప్రాయాలను విన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారాలని మోజారిటీ అభిమానులు  తీర్మానించడంతో ఆ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్ రెడ్డి…గతంలో వైసీపీని వీడి జగన్‌కు అన్యాయం చేశానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పటికి మూడు సార్లు తమ కుటుంబానికి అన్యాయం చేశరని వాపోయారు. తెలుగుదేశం పార్టీలో తనలాంటి బాధితుడు మరోకరు ఉండరేమో అంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.  కర్నూలు వైకాపా అభ్యర్థి హఫీజ్‌ విజయానికి కృషి చేస్తానని మోహన్‌రెడ్డి చెప్పారు. కర్నూలు సీటు కోసం  సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు ఎంపీ టీజీ వెంకటేశ్ తనయుడు భరత్‌ కూడా  పోటీ పడ్డారు. అన్ని సమీకరణాాలను అంచనా వేసుకున్నచంద్రబాబు చివరకు  టీజీ భరత్‌కే టికెట్‌ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్‌రెడ్డి తిరిగి వైసీపీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.