Rajinikanth Returns: తలైవా మళ్లీ వస్తున్నాడు.. రీ ఏంట్రీపై తేల్చేస్తానంటున్న సూపర్ స్టార్

|

Jul 12, 2021 | 10:41 AM

కబాలీ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారా.. ఈసారి ఫుల్‌ టైమ్‌ పాలిటిక్స్‌లో కొనసాగాలని డిసైడ్ అయ్యారా.. తమిళనాడులో అభిమాన సంఘాలతో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ సమావేశం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లోకి..

Rajinikanth Returns: తలైవా మళ్లీ వస్తున్నాడు.. రీ ఏంట్రీపై తేల్చేస్తానంటున్న సూపర్ స్టార్
Rajinikanth
Follow us on

కబాలీ మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారా.. ఈసారి ఫుల్‌ టైమ్‌ పాలిటిక్స్‌లో కొనసాగాలని డిసైడ్ అయ్యారా.. తమిళనాడులో అభిమాన సంఘాలతో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ సమావేశం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లోకి సూపర్‌స్టార్‌ రీఎంట్రీపై చర్చ మళ్లీ రచ్చ చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయాల్లోకి రానని ఏనాడు చెప్పలేదని రజినీ చెప్పడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.కోవిడ్ కారణంగా సమయం కాదని మాత్రమే ఆనాడు చెప్పానని అనడం చూస్తుంటే.. రజినీ మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. పాలిటిక్స్‌లోకి వస్తారా.. రారా అని చాలామంది అడుగుతున్నారని.. అందుకే అభిమానులతో సమావేశమయ్యానని స్పష్టం చేశారు రజినీ. ఫైనల్‌గా రీ ఏంట్రీపై అభిమానుల, సలహాలు రజినీ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇవాళ(సోమవారం) అభిమానులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ అభిమాన సంఘ నేతలను కలుస్తున్న నేపథ్యంలో మరోసారి చర్చ మొదలైంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు.  వైద్య ప‌రీక్ష‌ల కోసం జూన్ 19న భార్య లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మయో క్లినికల్‌ ఆస్పత్రిలో రజనీకాంత్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు చేశారు. ఎలాంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించడంతో ఆయన తిరిగి చెన్నై చేరుకున్నారు.

ఇక రజినీకాంత్‌కు ఉ‍న్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతా ఇంతా కాదు. ఆయన స్టైల్‌కి సినీ ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. ఆయన నడక, నటన, డ్యాన్స్‌, ఫైట్‌, డైలాగ్‌ ఇలా సీన్‌ ఏదైనా సగటు ప్రేక్షకుడు ఊగిపోవాల్సిందే.

ఇవి కూడా చదవండి : Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..

Lanke Binde: సూర్యాపేట జిల్లాలో లంకెబిందెల కలకలం.. బిందెడు బంగారంను సరిసమానంగా పంపిణీ చేసిన హోంగార్డు..