ఎన్నికల్లో పార్టీలు ఇటీవలి ఘటనలను ప్రస్తావించకుండా చూడండి : సిఇసికి మాజీ నేవీ చీఫ్‌ వినతి

న్యూఢిల్లి : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు పుల్వామాలో దాడి, ఐఎఎఫ్‌ వైమానిక దాడులు, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వ్యవహారం తదితర అంశాలను ప్రస్తావించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నావికాదళం విశ్రాంత చీఫ్‌ అడ్మిరల్‌ ఎల్‌ రామ్‌దాస్‌ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరాకు అడ్మిరల్‌ రామ్‌దాస్‌ బహిరంగ లేఖ రాస్తూ రాజకీయ పార్టీలు సాయుధ దళాల వీరోచిత కార్యాలను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడంపై ఆందోళన […]

ఎన్నికల్లో పార్టీలు ఇటీవలి ఘటనలను ప్రస్తావించకుండా చూడండి : సిఇసికి మాజీ నేవీ చీఫ్‌ వినతి

Edited By:

Updated on: Mar 09, 2019 | 7:20 PM

న్యూఢిల్లి : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు పుల్వామాలో దాడి, ఐఎఎఫ్‌ వైమానిక దాడులు, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వ్యవహారం తదితర అంశాలను ప్రస్తావించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నావికాదళం విశ్రాంత చీఫ్‌ అడ్మిరల్‌ ఎల్‌ రామ్‌దాస్‌ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరాకు అడ్మిరల్‌ రామ్‌దాస్‌ బహిరంగ లేఖ రాస్తూ రాజకీయ పార్టీలు సాయుధ దళాల వీరోచిత కార్యాలను తమ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరికొద్ది వారాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇటీవలి సంఘటనలను తమ లబ్ధి కోసం దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.