పీవీపీ వ్యాఖ్యలతో జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన టీడీపీ

ప్రత్యేకహోదానే మా నినాదం అంటూ 2014 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం ప్రతిపక్ష హోదాలో ఆమరణ దీక్షను సైతం చేశారు. అయితే ప్రత్యేకహోదాను ఇవ్వమని ఎన్టీయే ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా ప్రత్యేకహోదాను వదిలే ప్రసక్తే లేదంటూ జగన్ అంటూనే ఉన్నారు. ఇదంతా పక్కనపెడితే తాజాగా వైసీపీ నుంచి ఎంపీ బరిలో పోటీ చేయబోతున్న ప్రముఖ వ్యాపారవేత్త పీవీపీ ప్రత్యేకహోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదొక […]

పీవీపీ వ్యాఖ్యలతో జగన్‌పై విమర్శలు  ఎక్కుపెట్టిన టీడీపీ

Edited By:

Updated on: Mar 22, 2019 | 1:27 PM

ప్రత్యేకహోదానే మా నినాదం అంటూ 2014 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం ప్రతిపక్ష హోదాలో ఆమరణ దీక్షను సైతం చేశారు. అయితే ప్రత్యేకహోదాను ఇవ్వమని ఎన్టీయే ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా ప్రత్యేకహోదాను వదిలే ప్రసక్తే లేదంటూ జగన్ అంటూనే ఉన్నారు.

ఇదంతా పక్కనపెడితే తాజాగా వైసీపీ నుంచి ఎంపీ బరిలో పోటీ చేయబోతున్న ప్రముఖ వ్యాపారవేత్త పీవీపీ ప్రత్యేకహోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదొక బోరింగ్ సబ్జెక్ట్ అంటూ ఆయన కామెంట్ చేశారు. దీంతో అధికార పార్టీకి వైసీపీని విమర్శించేందుకు మరో పాయింట్ దొరికింది. ప్రత్యేకహోదాపై ఆ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు జగన్ నాటకాన్ని బయటపెట్టాయంటూ టీడీపీకి చెందిన పలువురు ఆరోపణలు చేస్తున్నారు. మోదీతో జగన్ కుమ్మక్కు అయ్యారన్న వార్తలకు ఇదే నిదర్శనం అంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. తన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్, మోదీ, కేసీఆర్‌లతో చేతులు కలిపారని వారు విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఈ వివాదంపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.