Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..

|

Mar 13, 2022 | 10:56 PM

Sonia Gandhi: ఐదు రాష్ట్రాల్లో ఓటమికి బాధ్యతగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ తన రాజీనామాని ప్రకటించారు. అయితే సభ్యులందరు దీనిని తిరస్కరించారు.

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..
Sonia Gandhi
Follow us on

Sonia Gandhi: ఐదు రాష్ట్రాల్లో ఓటమికి బాధ్యతగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ తన రాజీనామాని ప్రకటించారు. అయితే సభ్యులందరు దీనిని తిరస్కరించారు. పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి కమిటీ సోనియా గాంధీ వైపే మొగ్గుచూపింది. సమావేశం అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న నేతల మాటలు విన్న సోనియాగాంధీ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దాదాపు ఐదు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. భాజపా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పార్టీ విఫలమైందని సమావేశం అభిప్రాయ పడినట్లు వెల్లడించారు.

పంజాబ్‌లో సీఎం మార్పు తర్వాత తీసుకోవాల్సిన చర్యలను అమలు చేయడంలో విఫలమైనట్లు పేర్కొన్నారు. లోపాలను సరిదిద్దుకొని పుంజుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, పీ చిదంబరం వంటి సీనియర్‌ నేతలు హాజరయ్యారు. వీరితోపాటు గులాంనబీ ఆజాద్‌, మనీశ్‌ తివారీ, ఆనంద్‌ శర్మ వంటి అసమ్మతి నేతలు కూడా హాజరయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరుకాకపోగా, మాజీ రక్షణాశాఖ మంత్రి ఏకే ఆంటోనీకి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఈ భేటీకి రాలేకపోయారు.

IND vs SL: క్లీన్ స్వీప్ దిశగా రోహిత్ సేన.. శ్రీలంక విజయానికి 419 పరుగులు.. భారత్‌కు 9 వికెట్లు..

Beauty Tips: వేసవిలో ఫేస్ గ్లో తగ్గకూడదనుకుంటే.. జస్ట్ ఈ చిట్కాలు పాటించండి అంతే..

Viral Video: ఈ కుక్క స్టైలే వేరప్ప.. అందగత్తెల్లా ర్యాంప్ వాక్‌తో రెచ్చిపోయింది.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Iraq Rocket Attack: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్‌.. ఇరాక్‌ లోని యూఎస్‌ ఎంబసీపై మిస్సైల్‌ దాడి..