ఢిల్లీలో కాల్పులు.. ఆప్ కార్యకర్త మృతి.. ఎమ్మెల్యే పై హత్యా యత్నమేనా?

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఆప్  ఘన విజయం సాధించింది. అయితే అప్పుడే ఈ పార్టీ ఎమ్మెల్యే ఒకరికి చేదు అనుభవం ఎదురైంది. నరేష్ యాదవ్ అనే ఈఎమ్మెల్యే అనుచరుల్లో ఒకరైన అశోక్ మాన్ దుండగుల కాల్పుల్లో బుల్లెట్ గాయాలకు గురై మరణించాడు. మరొకరు గాయపడ్డారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో జరిగిందీ ఘటన. నరేష్ యాదవ్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆలయానికి వెళ్లి ఓపెన్ టాప్ కారులో తిరిగి వస్తుండగా. […]

ఢిల్లీలో కాల్పులు.. ఆప్ కార్యకర్త మృతి.. ఎమ్మెల్యే పై హత్యా యత్నమేనా?

Edited By:

Updated on: Feb 12, 2020 | 11:22 AM

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఆప్  ఘన విజయం సాధించింది. అయితే అప్పుడే ఈ పార్టీ ఎమ్మెల్యే ఒకరికి చేదు అనుభవం ఎదురైంది. నరేష్ యాదవ్ అనే ఈఎమ్మెల్యే అనుచరుల్లో ఒకరైన అశోక్ మాన్ దుండగుల కాల్పుల్లో బుల్లెట్ గాయాలకు గురై మరణించాడు. మరొకరు గాయపడ్డారు. మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో జరిగిందీ ఘటన. నరేష్ యాదవ్ తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆలయానికి వెళ్లి ఓపెన్ టాప్ కారులో తిరిగి వస్తుండగా. . కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకడు అశోక్ మాన్ ను హతమార్చాలన్నదే తన ఉద్దేశమని అంగీకరించినట్టు తెలిసింది. అలాగే అతని బంధువు హరేందర్ ను కూడా చంపాలనుకున్నాడట. తాము గుడి నుంచి తిరిగి వస్తుండగా ఆ ప్రాంతంలో స్థానికులు కొందరు బాణాసంచా కాల్చారని,  ఈ పేలుడు శబ్దం అదే అనుకున్నానని, నరేష్ యాదవ్ చెప్పారు. జరిగిన ఘటనను దురదృష్టకరమైనదిగా పేర్కొన్న ఆయన.. తన అనుచరుల్లో ఒకరు మరణించినందుకు సంతాపం వ్యక్తం చేశారు. అసలిది తనపైనే హత్యా యత్నమని భావించినట్టు ఆయన చెప్పారు. మెహరౌలీ నియోజకవర్గం నుంచి నరేష్ యాదవ్ గెలుపొందారు. అటు-ఈ కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.