వాళ్లిద్దరు పోటీ చేయడం లేదంటే ఎన్డీఏ గెలుపు ఖాయమంటున్న శివసేన

| Edited By:

Mar 22, 2019 | 4:43 PM

ముంబై : ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌, బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడమే ఎన్‌డిఏ విజయం పొందుతుందనడానికి సంకేతమని శివసేన పేర్కొంది. శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నాలో వచ్చిన ఎడిటోరియల్‌లో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమికి ప్రియాంకా గాంధీ గండి కొట్టే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్, మాయావతి ఓటు బ్యాంక్ ఒకటేనని, ఇప్పుడది చీలిపోనుందని శివసేన అభిప్రాయపడింది. శరద్ పవార్, […]

వాళ్లిద్దరు పోటీ చేయడం లేదంటే ఎన్డీఏ గెలుపు ఖాయమంటున్న శివసేన
Follow us on

ముంబై : ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌, బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడమే ఎన్‌డిఏ విజయం పొందుతుందనడానికి సంకేతమని శివసేన పేర్కొంది. శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నాలో వచ్చిన ఎడిటోరియల్‌లో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమికి ప్రియాంకా గాంధీ గండి కొట్టే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్, మాయావతి ఓటు బ్యాంక్ ఒకటేనని, ఇప్పుడది చీలిపోనుందని శివసేన అభిప్రాయపడింది. శరద్ పవార్, మాయావతి లోక్‌సభ ఎన్నికల నుంచి తప్పుకున్నారంటే వాళ్లు ప్రధానమంత్రి రేసులో లేనట్లే అని సేన ఎడిటోరియల్‌లో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం తాను పోటీ చేయడం లేదని మాయావతి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. బీఎస్పీకి యూపీలో తప్ప మరెక్కడా బలం లేదని, ఆ లెక్కన మాయావతి పోటీ చేయడం లేదంటే యుద్ధం నుంచి పారిపోయినట్లేనని అభివర్ణించింది.

పవార్ కూడా ఇలాగే ఎన్నికల బరి నుంచి పారిపోయారని సామ్నా అభిప్రాయపడింది. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి ప్రయత్నించిన పవార్ తన కుటుంబాన్ని కూడా ఏకం చేయలేకపోయారని, అందుకే తప్పుకున్నారని సెటైర్ వేసింది. ఇక గత ఎన్నికల్లోలాగే ఈసారి ప్రియాంకా గాంధీ వల్ల తనకు దళితులు, యాదవుల ఓట్లు దక్కవేమో అన్న ఆందోళన మాయావతిలో ఉన్నదని ఆ పత్రిక తెలిపింది. ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రావడం వల్లే మాయావతి పోటీ నుంచి తప్పుకున్నారని, నిజానికి మాయావతికి అసలు భయం కాంగ్రెసేనని స్పష్టం చేసింది.