AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌గాంధీకి సలహాలు ఇచ్చిన శివసేన ఎంపీ

కాంగ్రెస్‌పార్టీ నాయకత్వంపై వారం రోజుల బోలెడంత చర్చ జరిగింది.. ప్రస్తుతానికి నాయకత్వ మార్పు లేదని తేలిపోయింది.. అయితే కాంగ్రెస్‌ పార్టీ గురించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా నిర్మోహమాటంగా, నిష్కర్షగా తన అభిప్రాయాలు తెలిపారు..

రాహుల్‌గాంధీకి సలహాలు ఇచ్చిన శివసేన ఎంపీ
Balu
|

Updated on: Aug 30, 2020 | 5:22 PM

Share

కాంగ్రెస్‌పార్టీ నాయకత్వంపై వారం రోజుల బోలెడంత చర్చ జరిగింది.. ప్రస్తుతానికి నాయకత్వ మార్పు లేదని తేలిపోయింది.. అయితే కాంగ్రెస్‌ పార్టీ గురించి శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కూడా నిర్మోహమాటంగా, నిష్కర్షగా తన అభిప్రాయాలు తెలిపారు.. పార్టీ నాయకత్వాన్ని చేపట్టకుండా రాహుల్‌గాంధీని అడ్డుకుంటే మాత్రం ఆ పార్టీకి పుట్టగతులుండవన్న అర్థం వచ్చేలా కాస్త సాఫ్ట్‌గా చెప్పారు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సరితూగే వ్యక్తి కాంగ్రెస్‌పార్టీలో లేరన్నారు.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి ఆ పార్టీకి చెందిన 23 మంది సీనియర్‌ నేతలు లేఖ రాయడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో క్రియాశీలకంగా ఉండకుండా వారిని అడ్డుపడిందెవరని ప్రశ్నించారు.

గాంధీ కుటుంబానికి చెందిన వారు కాకుండా ఇతరులు కాంగ్రెస్‌ బాధ్యతలను తీసుకుంటే బాగుంటుంది కానీ అంత శక్తిమంతులు పార్టీలో ఎవరున్నారని వ్యంగ్యంగా అన్నారు.. ఇదంతా శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసుకొచ్చారు సంజయ్‌ రౌత్‌. కాంగ్రెస్‌ పార్టీ మరణం లేని వృద్ధ మహిళలాంటిదని ఆ పార్టీకి చెందిన దివంగత నేత వి.ఎన్‌.గాడ్గిల్‌ చెప్పిన మాటను ప్రస్తావిస్తూ… అటువంటి పార్టీకి పూర్వ వైభవం తేవడమెలా అన్నదానిపై రాహుల్‌ ఆలోచిస్తే బాగుటుందన్నారు. సోనియాగాంధీకి సీనియర్లు లేఖ రాయడంపై రాహుల్‌ సీరియస్సయ్యారు.. బీజేపీతో కుమ్మక్కయ్యారంటూ తిట్టిపోశారు.. రాహుల్‌ వ్యాఖ్యలకు మనస్తాపం చెందిన సీనియర్లు ఓ దశలో రాజీనామాకు కూడా సిద్ధపడ్డారు.. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ వివరణ ఇవ్వడంతో మనసు మార్చుకున్నారు.. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్‌కు శివసేన మిత్రపక్షమే.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే!

ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?