ముగిసిన ఏడో విడత పోలింగ్

| Edited By:

May 19, 2019 | 5:18 PM

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం ఏడు విడతలుగా జరిగిన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 53.03 శాతం ఓటింగ్ నమోదైంది. బీహర్‌లో 46.75 శాతం, మధ్యప్రదేశ్‌లో 59.75 శాతం, పంజాబ్‌ 50.49 శాతం, ఉత్తర్‌ప్రదేశ్ 47.21 శాతం, వెస్ట్ బెంగాల్ 64.87 శాతం, జార్ఖండ్ 66.64శాతం చంఢీగర్‌ 51.18 శాతం నమోదైంది. వెస్ట్ బెంగాల్‌లో ఈ విడతలో కూడా పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా.. మిగతా చోట్ల ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5.00 […]

ముగిసిన ఏడో విడత పోలింగ్
Follow us on

సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం ఏడు విడతలుగా జరిగిన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 53.03 శాతం ఓటింగ్ నమోదైంది. బీహర్‌లో 46.75 శాతం, మధ్యప్రదేశ్‌లో 59.75 శాతం, పంజాబ్‌ 50.49 శాతం, ఉత్తర్‌ప్రదేశ్ 47.21 శాతం, వెస్ట్ బెంగాల్ 64.87 శాతం, జార్ఖండ్ 66.64శాతం చంఢీగర్‌ 51.18 శాతం నమోదైంది. వెస్ట్ బెంగాల్‌లో ఈ విడతలో కూడా పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకోగా.. మిగతా చోట్ల ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5.00 గంటల వరకు లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.