పార్టీకి తిరుగులేని మెజారిటీ తెచ్చిన ఆ సీనియర్‌ ఎమ్మెల్యేలు ఎక్కడా? ఎందుకీ మౌనం?

ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల తీరు పార్టీ కేడర్ లో అయోమయానికి గురిచేస్తోంది. పార్టీ సానుభూతిపరులు ముఖ్య అనుచరులు కూడా పదవుల కోసం ఎమ్మెల్యేలను అడిగే పరిస్థితి లేకపోతోంది.

పార్టీకి తిరుగులేని మెజారిటీ తెచ్చిన ఆ  సీనియర్‌ ఎమ్మెల్యేలు ఎక్కడా? ఎందుకీ మౌనం?
Amarnath Reddy, Nallari Kishore Kumar Reddy
Follow us
Raju M P R

| Edited By: Balaraju Goud

Updated on: Nov 15, 2024 | 11:33 AM

ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మౌన ముంద్రలో ఉన్నట్టున్నారు.. పార్టీ పవర్ లో ఉన్నా వాళ్ళలో దూకుడు కనిపించడం లేదు. సొంత పనులకు ఇంపార్టెన్స్ ఇస్తున్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారట. ఒకరేమో బెంగుళూరు.. మరొకరు హైదరాబాద్‌లో ఎక్కువగా గడుపుతున్నారట. సొంత నియోజక వర్గాల్లో పొలిటికల్ పవర్ ప్రదర్శించకుండా కేడర్‌ను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదట. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మౌనం మంత్రి పదవి రాలేదనేన్నదేనా లేక ఇంకేమైనా కారణమా అన్న చర్చ నడుస్తోంది..!

చిత్తూరు జిల్లా.. ఏపీ రాజకీయాల్లో ఆ జిల్లాదో ప్రత్యేకత. అంతేకాదు సీఎం, మాజీ సీఎం తోపాటు పలువురు మాజీ మంత్రులు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న జిల్లా కావడంతో రాజకీయాల్లో ఎప్పుడూ చర్చగానే ఉంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో అధికార పార్టీకి తిరుగులేని మెజారిటీ వచ్చినా ఆ పార్టీ సీనియర్లలో కొందరి మౌనం ఇప్పుడు చర్చగా మారింది.

2024 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీని సాధించిన కూటమి సర్కార్ కేబినెట్‌లో చోటు దక్కని పరిస్థితి ఇందుకు కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ పవర్ లోకి వస్తే తాము కీలకంగా ఉంటామని భావించిన నేతలకు అధికారం అందరి ద్రాక్ష అయింది. మాజీ మంత్రిగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు తర్వాత అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీలో ఏ సమస్య అయినా తలలో నాలుకలా వ్యవహరించి పరిష్కరించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు ఇప్పుడు అంటీ ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారట. పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ ఇద్దరికీ మంత్రి పదవులు వస్తాయని భావించిన పార్టీ క్యాడర్ ఇప్పుడు వాళ్ళిద్దరికీ మంత్రి పదవులు దక్కక పోవడంతో అసంతృప్తిగా ఉన్నారట.

ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి లకు కేబినెట్‌లో చోటు దక్కకపోవడం నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు నియోజక వర్గానికే పరిమితమై పోయారు. నియోజక వర్గ రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. నియోజకవర్గం కంటే బయటనే ఉంటున్నారు. వారంలో సగం రోజులు సొంత పనులు, మిగతా రోజుల్లో నియోజక వర్గాల్లో ఉంటున్నారట. స్థానికంగా ఉంటే ఎమ్మెల్యేలు చుట్టూ జనం కూడా ఉంటున్నారు.

మరోవైపు, ఎమ్మెల్యేకు ఉన్న అధికారం మినహా ఎలాంటి అదనపు అధికారం లేకపోవడం తో పార్టీ కేడర్ కూడా ఆ రెండు నియోజకవర్గాల్లో డీలాపడింది. అయితే పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, పీలేరులో నల్లారి కిషోర్ అందుబాటులో ఉంటే మాత్రం నియోజకవర్గ నేతలు అనుచరులు వందలాది మందితో ఎమ్మెల్యేల కార్యాలయాల కిక్కిరిసి పోతున్నాయి. ఈ విషయంలో పలమనేరులో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీరు కాస్త డిఫరెంట్ గానే ఉంది. ఎన్నికల దాకా జిల్లా తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన అమర్నాథ్ రెడ్డి ని కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తరచూ కలుస్తూనే ఉంటుండగా, అమర్నాథ్ రెడ్డి కూడా స్థానిక కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. అయితే అధికారిక హడావుడి చేయక పోవడం, గతంలో మాదిరిగా జిల్లా పార్టీలో అంతా తానే వ్యవహరించక పోవడం కేడర్ ను అయోమయానికి కారణం అవుతోంది. అయినా పెద్ద సంఖ్యలో పార్టీ క్యాడర్, లీడర్స్ కలిసేందుకు అమర్‌ను ప్రాధాన్యత ఇస్తున్నారు. పలమనేరులో స్థానికంగా ఉంటే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, అనుచరులను కలుస్తున్నారు.

ఇదే రీతిలోనే పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు. పీలేరుకు వచ్చినప్పుడంతా హడావుడిగా ఉంటున్నారు. పార్టీ ముఖ్య నేతలు అనుచరులతో మమేకమవుతున్న నల్లారి కిషోర్ అధికారిక హడావుడి కి దూరంగా ఉంటున్నారు. అనవసర విషయాలేవీ పట్టించుకోకుండా కాలం వెల్లదీస్తున్నారు. అధికారులతో సమావేశాలు, గ్రామాల్లో పర్యటనలకు దూరంగానే ఉంటున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రులు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలను కలవకపోవడం కూడా జిల్లా రాజకీయాల్లో చర్చగా మారింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల మౌనముద్ర జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో ఛాన్స్ కోసం ప్రయత్నించే అనుచరులను కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు చేసే ప్రయత్నం చేయలేక పోయారు.

దీంతో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేల తీరు పార్టీ కేడర్ లో అయోమయానికి గురిచేస్తోంది. పార్టీ సానుభూతిపరులు ముఖ్య అనుచరులు కూడా పదవుల కోసం ఎమ్మెల్యేలను అడిగే పరిస్థితి లేకపోతోంది. వాళ్లకే దక్కని అధికారం తమకు ఎందుకులే అన్నట్టు కొందరు, ఎమ్మెల్యేలను అడిగితే పదవులు ఇప్పిస్తారో లేదో అన్న అనుమానం మరికొందరిలో నెలకొంది. దీంతో ప్రతిపక్షంలో ఉండగా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో రాణించిన అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచినా అధికారం దరి చేరక పోవడంతో జిల్లా రాజకీయాల్లో ఎవరి దారి వారిదన్నట్లు మారిపోయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..