మా వద్ద కరోనా వైరస్ వ్యాక్సిన్లు అయిపోతున్నాయి.. రేపటిలోగా పంపండి, కేంద్రానికి రాజస్తాన్ అభ్యర్థన

| Edited By: Anil kumar poka

Mar 09, 2021 | 1:08 PM

తమ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అయిపోతున్నాయని అత్యవసరంగా రేపటిలోగా టీకామందులను పంపాలని రాజస్తాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.  ప్రస్తుతం రోజుకు రెండున్నర లక్షల మందికి కోవిడ్ వ్యాక్షన్లు ఇస్తున్నామని, ఇప్పుడు 5.85 లక్షల డోసులు మాత్రమే ఉన్నాయని, ఇవి కేవలం రెండు రోజులకు సరిపోతాయని ప్రభుత్వం వెల్లడించింది.

మా వద్ద కరోనా వైరస్ వ్యాక్సిన్లు అయిపోతున్నాయి.. రేపటిలోగా పంపండి, కేంద్రానికి రాజస్తాన్ అభ్యర్థన
Follow us on

తమ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అయిపోతున్నాయని అత్యవసరంగా రేపటిలోగా టీకామందులను పంపాలని రాజస్తాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.  ప్రస్తుతం రోజుకు రెండున్నర లక్షల మందికి కోవిడ్ వ్యాక్షన్లు ఇస్తున్నామని, ఇప్పుడు 5.85 లక్షల డోసులు మాత్రమే ఉన్నాయని, ఇవి కేవలం రెండు రోజులకు సరిపోతాయని ప్రభుత్వం వెల్లడించింది. మీరు అర్జెంట్ గా మరిన్ని లక్షల డోసుల వ్యాక్సిన్లను పంపకపోతే తమకు సంకట పరిస్థితి ఎదురవుతుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. రఘు శర్మ.. ఎస్ఓఎస్ పంపారు.  వ్యాక్సిన్ డోసులు పరిమితంగా ఉన్న దృష్ట్యా,, కేవలం రెండో డోసు అవసరమైనవారికే టీకామందులు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 67 లక్షల మందికి కోవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చామని, ఇంకా దీన్ని తీసుకొనేవారు కొన్ని లక్షల మంది ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ కొరత కారణంగా ఈ డ్రైవ్ లో జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు.

అయితే కేంద్రం మాత్రం రాజస్థాన్ లో మరీ అంత అత్యవసర పరిస్థితి లేదని, ఇప్పటికే 85 వేల ఎమర్జెన్సీ వ్యాక్సిన్ డోసులను పంపామని కేంద్రం తెలిపింది. కాగా-బుంది, జాల్వార్, నాగౌర్, జైపూర్, కరౌలీ వంటి జిల్లాల్లో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. నిన్న 38  మంది ఎమ్మెల్యేలతో సహా 77 మంది టీకామందులు  తీసుకున్నారు. తాజాగా 179 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 3లక్షల 21 వేలమందికి పైగా కరోనా వైరస్ కి గురయ్యారు.  గత 24 గంటల్లో  వైరస్ మృతులు ఎవరూ లేనప్పటికీ తమకు అత్యవసరంగా వ్యాక్సిన్లు  అవసరమని, ముందు జాగ్రత్త చర్యగా వీటిని కోరుతున్నామని రాజస్తాన్ ప్రభుత్వం తెలిపింది.కాగా ఇండియాలో గత 24 గంటల్లో 15, 388 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 77 మంది మరణించారు. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ని మరింత వేగవంతం చేయాలనీ కేంద్రం భావిస్తోంది.  రీకవరీ రేటు 96.93 శాతం ఉన్నట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది.  ముఖ్యంగా మహారాష్ట్రలో మళ్ళీ ఈ వైరస్ వ్యాప్తి చెందడం అధికారులకు కలవరం కలిగిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

Tamil Nadu Election 2021: తమిళనాడులో ఎలక్షన్ హీట్.. ఒక్కరోజు సీఎంను కలిసిన కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి

ఐపీఎల్ 2021: స్టార్ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్న ఆర్‌సీబీ ప్లేయర్.. ఈసారి ఆరెంజ్ క్యాప్ గ్యారెంటీ.!