Sasikala’s Reclaim Aiadmk: తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ మళ్ళీ పాలక అన్నాడీఎంకె లో కీలక పదవి చేబట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి సీఎం పళనిస్వామి, డిప్యూటీ పన్నీర్ సెల్వం పై చెన్నై కోర్టులో తాజాగా లా సూట్ దాఖలు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగిస్తూ పళనిస్వామి, పన్నీర్ సెల్వం లోగడ నిర్వహించిన ఏఐడీఎంకె జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ 2017 లోనే శశికళ కోర్టుకెక్కారు. ఇప్పుడు తాజాగా తనకు అత్యధిక పరిహారం చెల్లించాలని, తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఆమె కోరారు. అయితే మార్చి 15 న దీనిపై విచారణ జరగాలని కోర్టు ఆదేశించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిన్నమ్మ బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల పాటు జైల్లో ‘గడిపారు’. అస్వస్థురాలై, చికిత్స పొందిన తరువాత ఆమె మళ్ళీ తమిళనాడులో క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. ఆమెను తిరిగి అన్నా డీఎంకెలో చేర్చుకునే ప్రసక్తి లేదని పళనిస్వామి ఇదివరకే ప్రకటించారు. కానీ శశికళ మాత్రం తన కారుకు ఈ పార్టీ పతాకాన్ని తగిలించుకుని తిరుగుతూ హడావుడి సృష్టిస్తున్నారు. తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ చక్రం తిప్పడానికి శశికళ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు.
Read More:
మమతను ఢీ కొనేందుకు సినీ, టీవీ యాక్టర్లను చేర్చుకుంటున్న బీజేపీ, ఎన్నికల ముందు భలే ఎత్తుగడ