సమాజ్వాది పార్టీ అధినేత UP మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022 లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తాను చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నానని.. రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పొత్తు ఖరారైందని, సీట్ల పంపకం గురించి ఇంకా మాట్లాడలేదని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఎన్నికల్లో చాచా శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ లోహియా (పిఎస్‌పిఎల్)ని తీసుకునే అవకాశంపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. “నాకు దానితో ఎటువంటి సమస్య లేదు. వారికి వారి ప్రజలకు తగిన గౌరవం ఇవ్వబడుతుంది.”
SP supremo Akhilesh Yadav says he will not be contesting the next Uttar Pradesh Assembly polls
— Press Trust of India (@PTI_News) November 1, 2021
మరోవైపు అఖిలేష్ యాదవ్ చేసిన జిన్నా ప్రకటనపై రాజకీయాలు యూపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎదురుదాడికి దిగారు. పటేల్‌ను జిన్నాతో పోల్చడం సిగ్గుచేటని సీఎం యోగి అన్నారు. అఖిలేష్ యాదవ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన మనస్తత్వాన్ని ప్రజలు అంగీకరించరని.. ఎస్పీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన చాలా సిగ్గుచేటని ముఖ్యమంత్రి యోగి అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఐక్యత, సమగ్రతకు రూపశిల్పి అని వెల్లడించారు.
ఇదీ తాలిబనీ మనస్తత్వం అని సీఎం యోగి అన్నారు. ముందుగా కులం పేరుతోనో ఇతర వాగ్దానాలనో తుంగలో తొక్కే ధోరణి, తమ పథకాలు సఫలం కానప్పుడు మహానుభావులను దూషిస్తూ మొత్తం సమాజాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: PM Modi: విదేశాల నుంచి రావడమే ఆలస్యం 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. ఆ అంశంపైనే చర్చ..
LPG Price Rise: దీపావళి ముందు భారీ షాక్.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర.. ఎంత పెరిగిందంటే..