డీఎంకే కోశాధికారి గోడౌన్‌లో పట్టుబడ్డ 20కోట్లు

| Edited By:

Apr 01, 2019 | 11:43 AM

చెన్నైలో నోట్ల కట్టలు బుసలు కొడుతున్నాయి. రాజకీయ నాయకుల నివాసాలు, గోడౌన్‌లో జరిగిన ఐటీ సోదాల్లో ట్రక్కుల కొద్ది నోట్లు బయటపడుతున్నాయి. దీంతో ఐటీ అధికారులే షాక్ తింటున్నారు. కాగా డీఎంకే పార్టీ కోశాధికారి దురై మురుగన్‌కు చెందిన ఆస్తులపై శనివారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో పెద్ద పెద్ద అట్ట పెట్టల్లో భారీ నగదు పట్టుబడింది. దీన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు లెక్కలు వేయగా.. 20కోట్లుగా […]

డీఎంకే కోశాధికారి గోడౌన్‌లో పట్టుబడ్డ 20కోట్లు
Follow us on

చెన్నైలో నోట్ల కట్టలు బుసలు కొడుతున్నాయి. రాజకీయ నాయకుల నివాసాలు, గోడౌన్‌లో జరిగిన ఐటీ సోదాల్లో ట్రక్కుల కొద్ది నోట్లు బయటపడుతున్నాయి. దీంతో ఐటీ అధికారులే షాక్ తింటున్నారు.

కాగా డీఎంకే పార్టీ కోశాధికారి దురై మురుగన్‌కు చెందిన ఆస్తులపై శనివారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో పెద్ద పెద్ద అట్ట పెట్టల్లో భారీ నగదు పట్టుబడింది. దీన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు లెక్కలు వేయగా.. 20కోట్లుగా తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, నగదును సీజ్ చేసి రిజర్వ్ బ్యాంక్‌కు తరలించారు.

అయితే దురై మురగన్ కుమారుడు కదిర్ ఆనంద్ వెల్లూరు లోక్‌‌సభ  స్థానానికి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దాంతో ఈ నగదును ఎన్నికల కోసం దాచినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ దాడులను డీఎంకే నేతలు ఖండిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తమపై కక్ష గట్టే ఈ దాడులు చేస్తుందని వారు అంటున్నారు.