రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ అధినాయకత్వం ప్రకటించిన తర్వాత పార్టీలో సమీకరణాలు వేగంగా మారుచతున్నాయి. ఖమ్మం జిల్లా నేత భట్టి విక్రమార్క లేకుండానే, ఖమ్మం జిల్లా పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశాన్ని రేణుకా చౌదరి ఏర్పాటు చేయడం వెనుక రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ ఉందంటున్నారు ఇంతకీ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు ..రేణుకా చౌదరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం వెనక ఉన్న మతలబేంటి.. తెలుసుకుందాం పదండి.
తనను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలందరినీ మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. అయితే తాజాగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో ఖమ్మం జిల్లా పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి , స్తంబాని చంద్రశేఖర్, మానవతారాయ్ తో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఈ జిల్లా వాసే అయినప్పటికీ ఈ సమావేశానికి హాజరుకాకపోవడంతో పార్టీ లో ఏదో జరుగుతుందనే అనుమానం కలుగుతుంది ఆ జిల్లా కాంగ్రెస్ ద్వితీయ శ్రేణీ నాయకులకు, కార్యకర్తలకు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మొదటి నుంచి భట్టి విక్రమార్కకు, రేణుకా చౌదరికి పడదు అనేది ఆ జిల్లా పార్టీ నేతల మాట. అందుకే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రేణుకా చౌదరి రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చాక యాక్టీవ్ అయ్యారు. అందుకే జిల్లాలో భట్టికి చెక్ పెట్టాలని చూస్తున్న రేణుకా చౌదరికి రేవంత్ రెడ్డి పీసీసీ కావడంతో వెంటనే రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీ ముఖ్యనేతలందరినీ పిలిచి భట్టికి చెక్ పెట్టాలని సూచించినట్లు తెలుస్తుంది.. రేవంత్ రెడ్డి కూడా రేణుకా చౌదరికి మద్దతు తెలిపినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. జిల్లాలో భట్టి వ్యతిరేక వర్గాన్నంతా ఏకం చేసి ఆయనపై ఒత్తిడి తీసుకురావాలనేది వీళ్ళ ప్లాన్ గా రేణుకా చౌదరి అనుచరులు చెప్తున్నారు..
భట్టికి చెక్ పెట్టడం ద్వారా ఖమ్మం జిల్లా పార్టీ మొత్తం తన గుప్పిట్లో కి వస్తుందనేది రేణుకా చౌదరి ప్లాన్ గా తెలుస్తోంది. అటు రేవంత్ రెడ్డి కూడా జిల్లా మొత్తాన్ని ఆజమాయిషీ చేసే నాయకురాలు మద్దతు ఇవ్వడం వల్ల తన పలుకుబడి పెరుగుతుందని స్నేహ హస్తం అందించినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్కను పక్కకు పెట్టాలనే రేణుకా చౌదరి ప్లాన్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.
Also Read: బుజ్జగింపా? మందలింపా? అసలు భట్టి ఎందుకు ఢిల్లీ వచ్చినట్టు.!