Rajasthan politics: రాహుల్‎ గాంధీతో‎ సచిన్ పైలట్ సమావేశం.. నాయకత్వ మార్పుకేనా?

|

Sep 25, 2021 | 4:58 PM

రాజస్థాన్​కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్.. రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. వీరి సమావేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌కు ఇన్‌చార్జిగా..

Rajasthan politics: రాహుల్‎ గాంధీతో‎ సచిన్ పైలట్ సమావేశం.. నాయకత్వ మార్పుకేనా?
Rajasthan Congress Leader Sachin Pilot Met With Rahul Gandhi
Follow us on

రాజస్థాన్​కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్.. రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. వీరి సమావేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్‌కు ఇన్‌చార్జిగా.. పైలట్‌ను నియమించాలనే ఆలోచనలో రాహుల్, ప్రియాంక ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు రాజస్థాన్​ మంత్రివర్గంలో మార్పులు జరగనున్నట్లు ప్రచారం సాగుతోంది.

దాదాపు 45 నిమిషాల పాటు రాహుల్ గాంధీ, సచిన్ పైలట్ చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో తనను ముఖ్యమంత్రి చేస్తారనే హామీని పైలట్‌వారి ముందు ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతానికి రాజస్థాన్ లో నాయకత్వ మార్పును వాయిదా వేయడానికే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు, ఇదే విషయాన్ని పైలట్‌కు వివరించేందుకు వారు సమావేశమైనట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన్ను కాస్త సంతృప్తి పరిచేందుకు.. రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన విధేయులను నియమించడానికి మాత్రం అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

తాజా పరిణామాలతో సీఎం అశోక్‌ గహ్లోత్‌ వర్గంలో కలవరం మొదలైనట్లు వినికిడి. గతేడాది ఆయనపై అసమ్మతి స్వరం వినిపిస్తూ సచిన్‌ పైలట్‌తోపాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేత కావడంతో.. పార్టీ అధిష్ఠానం ఆయనతో చర్చలు జరిపి సమస్యను కొలిక్కి తెచ్చింది. తాజాగా పైలట్‌ మరోసారి రాజకీయంగా పావులు కదుపుతుండటం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార బాధ్యతలను పైలట్‌కు అప్పగించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, పైలట్ ప్రస్తుతం రాజస్థాన్‌పైనే దృష్టి పెట్టారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ : Super Robo Video: సూపర్‌ రోబోను కనిపెట్టిన అఫ్గానిస్తాన్‌ యువతులు..!(వీడియో)

 Megastar Chiranjeevi: ఈరోజు నాకు చాలా స్పెషల్ డే..!గతాన్ని గుర్తు చేసుకొని మురిసిపోయిన మెగాస్టార్…(వీడియో)

 IPL 2021 : కావ్య దిగులును కేన్ సేన తీరుస్తారా..?రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్..(వీడియో)

 Jamieson-massage therapist Video: మసాజ్ మహిళపై జెమిసన్ మనసు పడ్డాడా..? పెద్దఎత్తున్న ట్రోల్ అవుతున్న ఈ ఫోటోపై మీమాటేంటి..?(వీడియో)