
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు హాజరు కాలేదు. ఈ సభకు తెలంగాణ అగ్రనేతలంతా హాజరైనా.. రాజాసింగ్ మాత్రం రాలేదు. మోదీ సభ జరిగిన ప్రాంగణం కూడా గోషామహల్ నియోజకవర్గం పరిధిలో ఉన్నా రాకపోవడం ఆసక్తిగా మారింది. బీజేపీలో మంచి నేతగా పేరున్న ఆయన.. సభకు రాకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధిష్టానంతో రాజాసింగ్‌కు విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే కొద్దిరోజుల క్రితం రాజాసింగ్ కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు. కానీ ప్రధాని మోదీ సభకు మాత్రం దూరంగా ఉన్నారు. మరోవైపు కొందరు రాజాసింగ్ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నా.. అలాంటిది ఏమీ లేదంటున్నారు బీజేపీ నేతలు.