స్థానిక సంస్థల ఎన్నికల వేళ కడప జిల్లా పులివెందులలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ వస్తోన్న సీనియర్ నేత, పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ సతీష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహారి శైలిపై అసంతృప్తిని వ్యక్తం చేసిన సతీష్ రెడ్డి.. దశాబ్దాలుగా టీడీపీలోనే ఉంటున్నా సరైన ఆదరణ లభించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పులివెందుల టీడీపీ ఇంచార్జ్‌గా బీటెక్ రవిని నియమించింది టీడీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో పులివెందులలో అభ్యర్థులను బరిలో నిలపాలని టీడీపీ అధిష్టానం బీటెక్ రవిని సూచించింది.
Read This Story Also: కరోనా ఎఫెక్ట్: ‘నో’ ఫంక్షన్లు.. కేరళ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు..!