AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక సంక్షోభానికి వాళ్ళే కారణం !

కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్, జేడీ-ఎస్ పార్టీలే కారణమని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు. సంకీర్ణ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, అవి సఫలం కాకపోవచ్చునని వారు భావిస్తున్నారు. రాష్ట్రంలో 13 నెలల సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల మొత్తం 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో గండంలో పడింది. పైగా స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి కూడా అయినా నగేష్ సోమవారం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. […]

కర్ణాటక సంక్షోభానికి వాళ్ళే కారణం !
Anil kumar poka
|

Updated on: Jul 09, 2019 | 12:47 PM

Share

కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్, జేడీ-ఎస్ పార్టీలే కారణమని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు. సంకీర్ణ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు డ్యామేజ్ కంట్రోల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, అవి సఫలం కాకపోవచ్చునని వారు భావిస్తున్నారు. రాష్ట్రంలో 13 నెలల సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల మొత్తం 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో గండంలో పడింది. పైగా స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి కూడా అయినా నగేష్ సోమవారం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. 21 మంది కాంగ్రెస్ మంత్రులతో బాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, జేడీ-ఎస్ మంత్రులు కూడా అదే బాట పట్టారని, త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని సీఎం కుమారస్వామి చేసిన ట్వీట్ ను కొందరు విశ్లేషకులు పేర్కొంటూ. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇదివరకే చేయాల్సి ఉండిందన్నారు. కాగా-గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోమవారం సమావేశమై కర్ణాటక రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ లోని ముఠా కక్షలు, సీఎం కుమారస్వామి నాయకత్వం పట్ల రెండు పార్టీల ఎమ్మెల్యేల్లోనూ విశ్వాసం లోపించడం కూడా ఇందుకు కారణమయ్యాయని బీజేపీ ప్రత్యారోపణ చేస్తోంది. కాంగ్రెస్ నేతల్లో సామర్థ్యం కొరవడడం వల్ల ఈ సంక్షోభం ఏర్పడిందని ఓ ఎనలిస్టు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ వారు విఫలమయ్యారన్నది ఆయన భావన.

ఉదాహరణకు గుజరాత్ కు చెందిన అహ్మద్ పటేల్ తమ రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యుల రాజీనామాలను ఆపలేకపోయారని, అలాగే తెలంగాణాలో తన పార్టీని గులాం నబీ ఆజాద్ కాపాడుకోలేకపోయారని ఆయన గుర్తు చేశారు. కర్ణాటక విషయానికి వస్తే ఆ రాష్ట్ర ఇన్-ఛార్జ్ కె.సి.వేణుగోపాల్ ఆదేశాలను మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య పట్టించుకోవడంలేదని మరో విశ్లేషకుడు అంటున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామికి జేడీ-ఎస్ లో గానీ, కాంగ్రెస్ పార్టీలో గానీ పాపులారిటీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాని, జేడీ-ఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ కుటుంబ పెత్తనాన్ని పలువురు జేడీ-ఎస్ సభ్యులే సహించడంలేదని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి ఇదే తగిన తరుణమని మరో విశ్లేషకుడు భావిస్తున్నారు.