
ఏపీలో టీడీపీ ఓడిపోతుందని.. అవినీతి, కుటుంబ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు కోరుకోవడం లేదని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్రమోడీ. ఇవాళ రాజమండ్రిలో జరిగే సభలో ప్రసంగించనున్న ఆయన.. ఏపీ పర్యటనపై ట్వీట్ చేశారు. ఏపీలో ఇది తనకు రెండో పర్యటన అంటూ.. సీఎం చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.
కాగా.. ఇప్పటికే కర్నూలులో జరిగిన సభలో చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు మోడీ. చంద్రబాబును యూటర్న్ బాబుగా అభివర్ణించారు. అంతేకాకుండా.. కేంద్ర పథకాలని తనవిగా చెప్పుకుని స్టిక్కర్ బాబుగా మారారని అన్నారు మోడీ. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు బంధువులు, ఆయన ద్వారా లబ్ధి పొందినవారే పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఇక సన్ రైజ్ ఏపీ.. అని చెబుతున్న చంద్రబాబు.. తన కుమారుడు లోకేష్ అభివృద్ధి కోసమే.. పాలన చేస్తున్నారని విమర్శించారు మోడీ.
అంతేగాక.. తెలంగాణ పర్యటనపైనా ట్వీట్ చేశారు మోడీ. భారత్‌ను సంపన్నమైన దేశంగా తీర్చిదిద్దడంలో సికింద్రాబాద్ ప్రజలు చాలా కష్టపడుతున్నారని ట్వీట్ చేశారు. అలాంటి సికింద్రాబాద్ ప్రజలను కలిసేందుకు తాను ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు మోడీ.