జగన్‌కు పవన్ కౌంటర్

ధర్మవరం: ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షనేత జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటరిచ్చారు. దొంగచాటుగా టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో టీడీపీకి మద్దతిస్తే మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ జగన్ మద్దతిస్తుంది కేసీఆర్, అమిత్‌షాకు కాదా అని ప్రశ్నించారు. ఫ్యాన్ వైర్లు కేసీఆర్ ఇస్తే స్పేర్ పార్ట్‌లు అమిత్‌షా అందిస్తున్నారా? అని పవన్ ప్రశ్నించారు. తాము ఏమీ దాయమని తమ సింబల్ గాజు గ్లాసులాగానే లోపలేముందో బయట అదే ఉంటుందని అన్నారు. అమిత్‌షాకి, బీజేపీకి […]

జగన్‌కు పవన్ కౌంటర్

Updated on: Mar 29, 2019 | 7:47 PM

ధర్మవరం: ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షనేత జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటరిచ్చారు. దొంగచాటుగా టీడీపీకి మద్దతివ్వాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో టీడీపీకి మద్దతిస్తే మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ జగన్ మద్దతిస్తుంది కేసీఆర్, అమిత్‌షాకు కాదా అని ప్రశ్నించారు. ఫ్యాన్ వైర్లు కేసీఆర్ ఇస్తే స్పేర్ పార్ట్‌లు అమిత్‌షా అందిస్తున్నారా? అని పవన్ ప్రశ్నించారు.

తాము ఏమీ దాయమని తమ సింబల్ గాజు గ్లాసులాగానే లోపలేముందో బయట అదే ఉంటుందని అన్నారు. అమిత్‌షాకి, బీజేపీకి జగన్ పార్ట్‌నర్ అని పవన్ ఎదురుదాడి చేశారు. తాను మోసాలు చేయనని, జీవితకాలం రాజకీయాల్లో నిలబడటానికి వచ్చానని పవన్ అన్నారు.