21న గాజువాక, 22న భీమవరంలో పవన్ నామినేషన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ తేదీలను ఆ పార్టీ ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుండి ఒకచోట, గోదావరి జిల్లాల నుండి మరోచోట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేయనున్న సంగతి తెలిసిందే. ఈనెల 21న విశాఖ జిల్లా గాజువాక నుండి, ఈనెల 22న తూర్పు గోదావరి జిల్లా భీమవరం నుండి నామినేషన్ వేయనున్నారు. అయితే 21న హొలీ సందర్భంగా సెలవుదినం కావడంతో తెలంగాణలో నామినేషన్లను స్వీకరించడం లేదని సీఈఓ రంజిత్ కుమార్ తెలపగా ఏపీ ఎన్నికల సంఘం ఇప్పటి వరకు […]

21న గాజువాక, 22న భీమవరంలో పవన్ నామినేషన్

Edited By:

Updated on: Mar 21, 2019 | 1:16 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ తేదీలను ఆ పార్టీ ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుండి ఒకచోట, గోదావరి జిల్లాల నుండి మరోచోట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేయనున్న సంగతి తెలిసిందే. ఈనెల 21న విశాఖ జిల్లా గాజువాక నుండి, ఈనెల 22న తూర్పు గోదావరి జిల్లా భీమవరం నుండి నామినేషన్ వేయనున్నారు. అయితే 21న హొలీ సందర్భంగా సెలవుదినం కావడంతో తెలంగాణలో నామినేషన్లను స్వీకరించడం లేదని సీఈఓ రంజిత్ కుమార్ తెలపగా ఏపీ ఎన్నికల సంఘం ఇప్పటి వరకు అలాంటి ప్రకటన చేయలేదు.