ఇవాళ నామినేషన్ వేయనున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న పవన్, గాజువాక స్థానానికి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. మరికాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్ నేరుగా జీవీఎంకు వెళ్లి తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఆ తరువాత 11 గంటలకు పాత గాజువాకలో బహిరంగ సభ నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడనున్నారు. భోజన విరామం తరువాత మధ్యాహ్నం మూడింటికి ఆనందపురం పూల మార్కెట్ వద్ద సాయంత్రం […]

ఇవాళ నామినేషన్ వేయనున్న పవన్

Edited By:

Updated on: Mar 21, 2019 | 2:56 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న పవన్, గాజువాక స్థానానికి ఇవాళ నామినేషన్ వేయనున్నారు. మరికాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్ నేరుగా జీవీఎంకు వెళ్లి తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఆ తరువాత 11 గంటలకు పాత గాజువాకలో బహిరంగ సభ నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడనున్నారు. భోజన విరామం తరువాత మధ్యాహ్నం మూడింటికి ఆనందపురం పూల మార్కెట్ వద్ద సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని పాత జైలు రోడ్డు వద్ద జరిగే సభల్లో ఆయన ప్రసగించనున్నారు.