ఇక మీ ఇష్టం: సీపీఐపై పవన్

పొత్తు నుంచి వైదొలుగుతానంటే అది మీ ఇష్టం అంటూ సీపీఐపై జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు చేశారు. తాను పొత్తు ధర్మాన్ని పాటిస్తానని, సీపీఐ నాయకులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని తనతో నడవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బందరు, పెడన, అవనిగడ్డలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పార్లమెంట్‌ స్థానం సీపీఐ అభ్యర్థికి ఇవ్వగా.. చివరి నిమిషంలో జనసేన అభ్యర్థిని ప్రకటించారు. […]

ఇక మీ ఇష్టం: సీపీఐపై పవన్

Edited By:

Updated on: Mar 25, 2019 | 6:48 PM

పొత్తు నుంచి వైదొలుగుతానంటే అది మీ ఇష్టం అంటూ సీపీఐపై జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలు చేశారు. తాను పొత్తు ధర్మాన్ని పాటిస్తానని, సీపీఐ నాయకులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని తనతో నడవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బందరు, పెడన, అవనిగడ్డలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే పొత్తులో భాగంగా విజయవాడ పార్లమెంట్‌ స్థానం సీపీఐ అభ్యర్థికి ఇవ్వగా.. చివరి నిమిషంలో జనసేన అభ్యర్థిని ప్రకటించారు. దీంతో పొత్తు నుంచి తొలుగుతున్నట్లు ప్రకటించిన సీపీఐ, పవన్‌పై విమర్శలు చేశారు. పవన్ ఇచ్చిన మాట నిలుపుకోలేదని సీపీఐ నేతలు ఆయనపై మండిపడ్డ విషయం తెలిసిందే.