Mango Diplomacy : పాకిస్తాన్ ‘మామిడి దౌత్యం’ తిరస్కరించబడింది..! యూఎస్, చైనాతో పాటు 32 దేశాలు రిజెక్ట్..

|

Jun 13, 2021 | 6:23 PM

Mango Diplomacy : పాకిస్తాన్‌కు 32 దేశాల అధిపతులు ఒక్కసారి షాక్ ఇచ్చారు. ప్రతి ఏడాదీ స్నేహపూర్వక సంబంధాల

Mango Diplomacy : పాకిస్తాన్ మామిడి దౌత్యం తిరస్కరించబడింది..! యూఎస్, చైనాతో పాటు 32 దేశాలు రిజెక్ట్..
Mango Diplomacy
Follow us on

Mango Diplomacy : పాకిస్తాన్‌కు 32 దేశాల అధిపతులు ఒక్కసారి షాక్ ఇచ్చారు. ప్రతి ఏడాదీ స్నేహపూర్వక సంబంధాల కోసం ఇతర దేశాల అధిపతులకు తమ దేశంలో పండే మామిడి పండ్లను పంపడం ఆనవాయితీగా వస్తోంది. పాక్‌ పంపిన మామిడి పండ్లను ఆయా దేశాల నేతలు స్వీకరించేవారు. అయితే ఈసారి పాక్‌ మిత్ర దేశమైన చైనా సహా 32 దేశాలు పాకిస్థాన్‌‌ మామిడిపండ్లను తిరస్కరించాయి. పాక్‌ అధ్యక్షుడు అరిఫ్‌ అల్వి పేరు మీదుగా పంపిన మామిడి పండ్లను అమెరికా, కెనెడా, నేపాల్‌, శ్రీలంక, టర్కీ, యుకె, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, రష్యా సహా 32 దేశాలు వెనక్కి పంపాయి.

అయితే పాక్‌ ఆనవాయితీగా కొనసాగిస్తున్న ఈ మామిడి దౌత్యాన్ని ఆయా దేశాలు సున్నితంగానే తిరస్కరించాయి. కరోనాను కారణంగా చూపుతూ ఆ పండ్లను తిరిగి పంపించాయి. ఫ్రెంచ్‌ అధ్యక్ష కార్యాలయానికి కూడా మామిడి పండ్లు పంపినట్లు పాక్‌ చెబుతున్నప్పటికీ ఆ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఇదిలా ఉండగా 2015లో నరేంద్ర మోదీ, ప్రణబ్‌ ముఖర్జీ, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, సోనియా గాంధీకి అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మామిడి పండ్లను పంపించారు.

పాకిస్తాన్ ఆల్-వెదర్ ఫ్రెండ్ చైనా కూడా తన పండ్ల స్మారక చిహ్నాలను తిరస్కరించింది. ముఖ్యంగా పాకిస్తాన్ ‘మామిడి దౌత్యం’ చైనాతో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మియాన్ అర్షద్ హుస్సేన్ 1960 లలో మావో జెడాంగ్‌కు మామిడి పండ్లను బహుమతిగా ఇచ్చినప్పుడు ఇరు దేశాలు వేసవి పండ్ల డబ్బాలపై తమ సంబంధాలను పటిష్టం చేసుకున్నాయి.

CM Jagan: వైసీపీ శ్రేణుల‌కు గుడ్ న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్న‌ల్.. ఆ రోజే ముహూర్తం!

TPCC Chief: గాంధీ కుటుంబ విధేయులకే TPCC ఇవ్వండి.. సోనియాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖాస్త్రం

Viral Video: సగం మెడ తెగిన కోడి పుంజు ?జంప్.. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లిలో ఘ‌ట‌న‌