నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

| Edited By:

Apr 02, 2019 | 7:26 PM

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 9రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఈ విడతలో ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. నేటి నుంచి ఏప్రిల్ 9 వరకు అభ్యర్ధుల నామినేషన్లను స్వీకరించనున్నారు. అనంతరం ఏప్రిల్ 10న నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఏప్రిల్ 12వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. నాలుగో విడతలో భాగంగా బీహార్‌లో 5స్థానాలకు, ఝార్ఖండ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 6, […]

నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ
Follow us on

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 9రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఈ విడతలో ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. నేటి నుంచి ఏప్రిల్ 9 వరకు అభ్యర్ధుల నామినేషన్లను స్వీకరించనున్నారు. అనంతరం ఏప్రిల్ 10న నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఏప్రిల్ 12వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. నాలుగో విడతలో భాగంగా బీహార్‌లో 5స్థానాలకు, ఝార్ఖండ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్రలోని 17, ఒడిషాలోని 6, రాజస్థాన్‌లోని 13, ఉత్తరప్రదేశ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

బీజేపీ, ఆర్జేడీ, సీపీఐ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. జేఎన్‌యూ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ సీపీఐ తరపున బరిలోకి దిగడంతో ఒక్కసారిగా బెగుసరాయ్ పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అటు ఆర్జేడీ నుంచి తన్వీర్ హసన్ బరిలోకి దిగనున్నారు.