సేనానికి షాక్..బీజేపీలోకి మహిళా నేత..పార్టీపై విమర్శలు!

జనసేన పార్టీకి  మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన  ఓ మహిళా నేత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన  పుట్టి లక్ష్మీసామ్రాజ్యం  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కార్యకర్తలతో కలిసి  కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాదు పార్టీ వీడిన వెంటనే ఆమె జనసేన పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. జనసేన పార్టీలో నిజాయితీ పనిచేసేవారికి స్థానం లేదంటూ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. లక్ష్మి సామ్రాజ్యం ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో […]

సేనానికి షాక్..బీజేపీలోకి మహిళా నేత..పార్టీపై విమర్శలు!
Lakshmi Samrajyam accused that injustice is meted out to her in Janasena.

Updated on: Aug 19, 2019 | 12:44 PM

జనసేన పార్టీకి  మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన  ఓ మహిళా నేత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన  పుట్టి లక్ష్మీసామ్రాజ్యం  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కార్యకర్తలతో కలిసి  కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాదు పార్టీ వీడిన వెంటనే ఆమె జనసేన పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. జనసేన పార్టీలో నిజాయితీ పనిచేసేవారికి స్థానం లేదంటూ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. లక్ష్మి సామ్రాజ్యం ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పెదకూరపాడు జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.